పరుచూరి అశోక్ బాబు (టీడీపీ ఎమ్మెల్సీ)
చంద్రబాబునాయుడి ఆరోగ్య పరిస్థితి.. వైద్యుల నివేదికలపై సకలశాఖల సలహా దారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చాలా పేలవంగా ఉన్నాయని, రాష్ట్రప్రభు త్వానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్షనేత ఆరోగ్యంపై తగిన శ్రద్ధ లేదని గ్రహించే రాష్ట్ర హైకోర్టు టీడీపీ అధినేతకు బెయిల్ మంజూరు చేసిందనే నిజాన్ని సజ్జల గుర్తెరిగి మాట్లాడాలని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు సూచించారు.
మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…!
“ చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి బయట కు రాకూడదన్న దుర్మార్గపు ఆలోచనతో జగన్ రెడ్డి.. సజ్జల…వైసీపీప్రభుత్వం చేయాల్సిన కుట్రలన్నీ చేశాయి. బెయిల్ పై విడుదలైన చంద్రబాబుని చూడటం కోసం ప్రజలు వేలసంఖ్యలో రోడ్లపైకి వచ్చినప్పుడు కూడా సజ్జల మతిలేకుండా మాట్లాడాడు.
ఏఏజీ ఆసుపత్రి వైద్యులు నిజంగా వైద్యులా..లేక రాజకీయ నాయకులా అని సజ్జల అనే ముందు ఆ ఆసుపత్రి గురించి తెలుసుకోవాలి. పద్మవిభూషణ్ గ్రహీత అయిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఏజీ ఆసుపత్రి నడుస్తోంది. అలాంటి ఆసుపత్రి యాజమాన్యం ప్రజానాయకుడు చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు చెప్పడం సజ్జలకు తప్పుగా కనిపించిందా? గతంలో జగన్ రెడ్డి కోడికత్తితో విమానాశ్రయంలో భుజంపై గీతలు పెట్టించుకొని, నేరుగా హైదరాబాద్ వెళ్లి, అక్కడ పడుకొని నాటకాలు ఆడాడు. 5, 6 కుట్లుపడిన గాయానికి ఆంధ్రాలో వైద్యం చేసేవారు లేరని ఆనాడు జగన్ హైదరాబాద్ కు వెళ్లాడా సజ్జలా ? అలాచేయడం అందరికీ చేతగాదుగా. కోడికత్తి కేసులో ఏపీ పోలీస్ వ్యవస్థపై తనకు నమ్మకం లేదన్న జగన్ రెడ్డి.. సజ్జలలే, వివేకాహత్యకేసులో సీబీఐ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అదే పోలీసుల్ని అడ్డంపెట్టి.. అవినాశ్ తల్లిని మంచమెక్కించి నాటకాలు ఆడారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ముద్దాయి కాదని తెలియదా సజ్జలా నీకు? తనపై ఉన్న అవినీతి.. ఇతర కేసులు గురించి తనకు ఎలాంటి సంబంధం లేదని జగన్ రెడ్డి మీడియాముందుకొచ్చి ఎప్పుడైనా చెప్పాడా సజ్జలా? చంద్ర బాబు బెయిల్ పై బయట ఉండటం సజ్జలకు..జగన్ రెడ్డికి నచ్చడంలేదు. అందుకే వైద్యుల సూచనల్ని కూడా వక్రీకరిస్తున్నారు.
సైకో పాలనలో సత్యం మరుగున పడటం.. అసత్యం అందలం ఎక్కడం, సజ్జల లాంటి వ్యక్తి అసత్యాలు చెప్పడం పెద్ద విచిత్రమేమీ కాదు
చంద్రబాబుకి కంటి ఆపరేషన్ చేశారు…దానికి 5 వారాల పాటు మందులు తీసుకోవాలని వైద్యులు చెప్పారు. అలానే ఆయన హార్ట్ ఎన్ లార్జ్ అయ్యిందని చెప్పారు. వైద్యులు అంతా పరీక్షించి వాస్తవాలు చెబితే..వాటిని తప్పుపట్టడం… ఆసుపత్రులపై నిందలేయడం సజ్జల సంస్కారహీనతకు నిదర్శనం. తనకు.. తన నాయకుడికి జరిగితే ఒకలా.. ఇతరులకు జరిగితే మరోలా మాట్లాడటం నీకే చెల్లిం ది సజ్జల. అబద్ధాలు, అసత్యాల ప్రచారంలో సజ్జలకు గోబెల్స్ కూడా సాటిరాడు. చంద్రబాబు బెయిల్ అంశం చాలా చిన్నది. కానీ వివేకానందరెడ్డి హత్యకేసులో జగన్.. వైసీపీనేతలు.. సాక్షిమీడియా ఎంత గందరగోళం చేశాయో.. ప్రజల్ని ఎలా తప్పుదారి పట్టించారో మర్చిపోయావా సజ్జలా? సైకోపాలనలో సత్యం మరుగున పడటం.. అసత్యం అందలం ఎక్కడం అనేది పెద్ద విచిత్రమేం కాదు. చంద్రబాబు నాయుడు బెయిల్ విషయంలో హైకోర్టు నిబంధనలు తెలుసుకున్నాక.. వాస్తవా లు తెలుసుకున్నాకే సజ్జల మాట్లాడాలి. జగన్ ముఖ్యమంత్రి అయితే ఎందుకు కోర్టుల్లో విచారణకు హాజరు కావడంలేదో సజ్జల చెప్పాలి. ఎలాంటి ప్రత్యేకహోదా ఉందని న్యాయస్థానాల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో చెప్పండి. వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో సీబీఐని ఇబ్బందిపెట్టి.. అవినాశ్ రెడ్డిని కాపాడటానికి జగన్ రెడ్డి చేసిన విన్యాసాలపై మాట్లాడు సజ్జలా! చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి నీకు లేదని తెలుసుకో సజ్జలా. అసత్యాలు.. అర్థసత్యాలతో నిందలు వేయడం.. అభాండాలు మోపడం వంటి దిక్కుమాలిన పనులు సజ్జల మానుకుంటే మంచిది.” అని అశోక్ బాబు హితవు పలికారు.