Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుగతేడాది రూ.770 కోట్లు .. ఈసారి మధ్యంతర బడ్జెట్‌లో రూ.600 కోట్లు

గతేడాది రూ.770 కోట్లు .. ఈసారి మధ్యంతర బడ్జెట్‌లో రూ.600 కోట్లు

మాల్దీవుల ఆర్థిక సాయంలో కోత పెట్టిన భారత్!

గతేడాది మాల్దీవులకు అంచనాలకు మించి సాయం చేసిన భారత్ ఈ ఏడాది బడ్జెట్‌లో మాత్రం కోత పెట్టింది. దౌత్యవివాదం నేపథ్యంలో భారత్ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. గతేడాది భారత్ మాల్దీవులకు బడ్జెట్‌లో రూ.400 కోట్ల సాయం ప్రకటించింది. కానీ ఏడాది ముగిసే నాటికి అంచనాలకు మించి ఖర్చు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ విషయం వెల్లడైంది. బడ్జెట్‌లోని సవరించిన అంచనాల ప్రకారం, గతేడాది భారత్ 770 కోట్లు మాల్దీవులపై ఖర్చు పెట్టింది. అయితే, తాజా మధ్యంతర బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ.600 కోట్లే కేటాయించింది. గతేడాది అంచనాలకంటే ఇది అధికంగానే ఉన్నా వాస్తవ ఖర్చు కంటే తక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఇక దౌత్య వివాదం నేపథ్యంలో భారత్ ఈసారి కేటాయింపుల మేరకు సాయం అందిస్తుందా? తగ్గిస్తుందా? అన్నది వేచి చూడాలి.
పొరుగు దేశాల విషయంలో భారత్ ఆభివృద్ధికారక సహకార విధానాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా అవసరంలో ఉన్న దేశాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్, లైన్ ఆఫ్ క్రెడిట్ పద్ధతుల్లో ఆర్థిక సాయం చేస్తోంది. సామర్థ్యం పెంపు, సాంకేతిక సాయాన్ని కూడా అందిస్తోంది. వాణిజ్యం, సాంస్కృతిక రంగం మొదలు ఇంజినీరింగ్, ఇంధనం, ప్రజారోగ్యం, ఐటీ, మౌలిక వసతులు, స్పోర్ట్స్, సైన్స్ వంటి విభిన్న రంగాల్లో పొరుగు దేశాలకు సహాయసహకారాలు అందిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article