గువహటి: అస్సాంలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో రూ.11,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. దేశంతోపాటు దక్షియా ఆసియాతో ఈశాన్య ప్రాంత అనుసంధానాన్ని ఇవి మెరుగుపరుస్తాయని తెలిపారు. గత దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో పర్యటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించారన్నారు.”భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత అధికారంలో ఉన్నవాళ్లు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను విస్మరించారు. వాటిని పాటించడం అవమానకరం అనే భావన కల్పించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పవిత్ర స్థలాలను పట్టించుకోలేదు. రాజకీయ లబ్ధి కోసం మన గతాన్ని మరుగున పడేలా వ్యవహరించారు. గత జ్ఞాపకాలను తుడిచేసిన ఏ దేశం కూడా పురోగతి సాధించలేదు. అవి కేవలం పర్యటక ప్రదేశాలు మాత్రమే కాదు.. వేల ఏళ్లనాటి భారత నాగరికతకు చిహ్నాలు. సంక్షోభాలను ఎదుర్కొని దేశం స్థిరంగా ఎలా నిలబడిందో చెప్పే గుర్తులు. గత పదేళ్లలో ఈ పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది” అని ప్రధాని తెలిపారు.