Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుగర్భవతులకు వైద్య పరీక్షలు

గర్భవతులకు వైద్య పరీక్షలు

గర్భవతులకు లేపాక్షి ఆలయ చైర్మన్ అన్నదానం.

లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం గర్భవతులు, బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వెంకట చిరంజీవి, డాక్టర్ రాజ్ కుమార్లు గర్భవతులకు, బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం పౌష్టికాహార ప్రయోజనాలను వారికి వివరించారు. అదేవిధంగా క్రమం తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు మందులను డాక్టర్ల సూచన మేరకు వాడాలన్నారు. అనంతరం గర్భవతులు, బాలింతలకు లేపాక్షి వీరభద్రాలయ ధర్మకర్తల మండల చైర్మన్ రమానందన్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఎం పి హెచ్ యువ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article