అమరావతి:“ప్రభుత్వంలో లేని గొప్పల్ని ఉన్నట్టుగా జగన్ రెడ్డి నేడు గవర్నర్ తో అర్థసత్యాలు, అసత్యాలు పలికించే ప్రయత్నం చేసి నవ్వుల పాలయ్యారు. విద్యా వ్యవస్థను పటిష్టపరిచినట్టు, నాడు-నేడు ద్వారా పాఠశాలల్ని ఆధునికీకరించిన ట్టు గవర్నర్ తో చెప్పించారు అని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు.తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో నాడు-నేడు పథకం కింద ఎన్ని పాఠశాలలు కొత్తగా ఏర్పాటుచేశారో, ఎన్ని పాఠశాలలకు ఫర్నీచర్, ఇతర సామాగ్రి అందించారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఇడుపుల పాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమకు ఫీజు రీయింబర్స్ మెంట్ సొమ్ము అందలేదని, 4 విడతలకు గాను 3 విడతల సొమ్ము ఇచ్చి, ఒక విడత ఎగ్గొట్టారని నిరసన చేపట్టారు. పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబ ర్స్ మెంట్ ఎగ్గొట్టిన ఘనుడు జగన్ రెడ్డే. నాడు-నేడు, అమ్మఒడి పథకాలతో అద్భుత ఫలితాలు సాధిస్తున్నట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 7.50లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారు.ఉద్యానవన పంటలసాగుకు ముఖ్యమైన డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతికి చంద్రబాబు రైతులకు అందించిన 90శాతం సబ్సిడీ ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలి? కరువు మండలాలు ప్రకటించకుండా, పంటలబీమా సొమ్ము అందించకుండా జగన్ రెడ్డి సొంత జిల్లా రైతాంగాన్నే ఎక్కువగా నష్టపరిచాడువ్యవసాయానికి సంబంధించి కూడా ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. 2019కి ముందు రాష్ట్రంలో డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులు పాటించి సాగుచేసే రైతులకు 90శాతం సబ్సిడీపై పరికరాలు అందేవి. ఇప్పుడు అలా అందుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పగలడా? పండ్లతోటల పెంపకం దారులకు గతంలో టీడీపీప్రభుత్వం సబ్సిడీపై మొక్కలు అందించింది. జగన్ రెడ్డి ఒక్క సంవత్సరమైనా రాయితీపై పండ్లమొక్కలు అందించాడా? కరువు మండలా లు ప్రకటిస్తే తనకు అవమానమని భావించిన జగన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని రైతుల్ని దారుణంగా వంచించాడు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి వైదొలిగిన ప్రభుత్వ నిర్వాకంతో రాయలసీమ రైతులే ఎక్కువగా నష్టపో యారు. గత 20 ఏళ్లకంటే అత్యల్ప వర్షపాతం రాయలసీమలో నమోదైనా రైతు లకు జగన్ ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదు. 2019 తర్వాత జగన్ ప్రభుత్వం ఒక్క ఎకరాకైనా అదనంగా నీరిచ్చిందా? పులివెందుల నియోజకవర్గం లో ఒక్క కాలువైనా ఒక్కకిలోమీటర్ అయినా పొడిగించాడా? జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ అని యువతను, సీపీఎస్ రద్దు అని ఉద్యోగుల్ని వంచించాడు. గవ ర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే సమయంలో గవర్నర్ తో చెప్పించిన అబద్ధాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తాము.” అని రామ్ గోపాల్ రెడ్డి చెప్పారు.మద్య నిషేధం హామీ ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలి.