గొల్లప్రోలు
గణతంత్ర దినోత్సవాన్ని గొల్లప్రోలులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో కమీషనర్ ఎమ్ సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే సొసైటీ కార్యాలయంలో సొసైటీ అధ్యక్షుడు జ్యోతుల భీముడు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శర్మ, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ బాలాజీ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన జెండా ఆవిష్కరణ సభలో చైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు, శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేశభక్తి భావంతో మెలగాలని, స్వాతంత్ర్య సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవాలని కోరారు. రిపబ్లిక్ డే వేడుకలలో ఎంపీపీ అరిగెల అచ్చియ్యమ్మ, మండల వైసీపీ అధ్యక్షుడు అరిగెల రామన్న దొర, అన్నవరం దేవస్థానం పావుగమండలి ప్రత్యేక ఆహ్వానితుడు మొగలి అయ్యారావు, పలువురు కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు.