ప్రజా భూమి, ఏలేశ్వరం
తూర్పుగోదావరి జిల్లా గ్రంధాలయం సంస్థ ఆధ్వర్యంలో ఏలేశ్వరం శాఖా గ్రంధాలయం నందు ఘనంగా 56 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సోమవారం ముగిసాయి . దీనిలో భాగంగ స్థానిక గ్రంధాలయంలో ఏర్పాటు చేసిన
కార్యక్రమానికి ముఖ్య
అతిధిగా నగర పంచాయతీ చైర్ పర్సన్ అలమండ.సత్యవతి చలమయ్య నగర పంచాయితీ వైస్ చైర్మన్శిడగం త్రివేణి మాజీ జెడ్పిటిసి శిడగం వెంకటేశ్వరవు 15 వార్డ్ మాజీ కౌన్సిలర్ సుంకర. రాంబాబు ముఖ్య అతిధులు గా విచ్చేశారు. గంధ పాలకుడు కవికొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించగా విశ్రాంతిి అధ్యా పకులు శ్రీ చెన్నా ప్రగడ.సత్య గాంధీ ఎ.బి.వి.ప్రసాద్, విశ్రాంతి ఉపాద్యాయులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాద్యాయులు గరికిపాటి.సురేష్ అలమండ.సురేష్ బి.సూర్యప్రకాష్ శ్రీ సత్యనారాయణ ప్రవేట్ పాఠశాల కు చెందిన ఉపాద్యాయులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు అయినా గ్రంథాలయ పాలకులు అయినా రవి కొండల సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో మెలగాలన్నారు. విద్యార్థులు అందరూ గ్రంధాలయంలో గల పుస్తకాలు చదవడం ముఖ్యం అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన వక్తలు కూడా ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం , క్విజ్ పోటీలలో నిర్వహించగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులు కు బహుమతి ప్రధానం చేశారు