లేపాక్షి :
మండల పరిధిలోని కోడి పల్లి గ్రామంలో వీర జవాన్ చంద్రశేఖర్ రెడ్డి 14వ వర్ధంతిని పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. 14 సంవత్సరాల క్రితం చంద్రశేఖర్ రెడ్డి టెర్రరిస్టుల బాంబు బ్లాస్టింగ్ లో వీరమరణం పొందారు. ఆదివారం చంద్రశేఖర్ రెడ్డి మిత్రమండలి ఆధ్వర్యంలో 14వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో చంద్రశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో తమ గురువులు నాగిరెడ్డి, కలీముల్లా తదితరులను ఘనంగా సన్మానించారు. 1998 -99 సంవత్సరంలో చంద్రశేఖర్ రెడ్డి చోళ సముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకున్నారు. అనంతరం భారత మిలటరీలో చేరి భారతదేశానికి సేవలు అందించినట్లు పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అమరవీరుడు చంద్రశేఖర్ రెడ్డి మిత్రులు పాల్గొన్నారు.