- పెద్ద ఎత్తున శని భగవానునికి తైలాభిషేకాలు
రామచంద్రాపురం :రామచంద్రాపురం మండలం రాయలచెరువుకు సమీపంలోని చాయాపురంలో వెలసి ఉన్న శనీశ్వర ఆలయంలో శనివారం శని త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలుఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అర్చకులు ఉంగరాల సుబ్రహ్మణ్యం శర్మ శని త్రయోదశి సందర్భంగా శని భగవానునినీ ఉదయం ఐదు గంటలకి సుప్రభాత సేవతో మేల్కొలిపారు. నిత్య పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తైలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. శని గ్రహ దుష్ప్రభావం నుంచి విముక్తి పొందటానికి భక్తులు నువ్వులను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి , దీపాలు వెలిగించారు . గణపతి హోమం,నవగ్రహ దోష నివారణ, శాంతి హోమాలు చేశారు. నిత్య అఖండ భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని అభయ హస్త ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. శనివారం నాడు శనీశ్వర భగవానునికి నువ్వుల తైలాభిషేకం నిర్వహించటంలో ఉన్న ప్రత్యేకతను అర్చకులు ఉంగరాల సుబ్రమణ్యం శర్మ భక్తులకు వివరించారు.శని ప్రభావం గురించి పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు సందేహ నివృత్తి చేశారు. వచ్చిన భక్తులకు ఆలయ నిర్వహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు