చింతలపూడి నియోజకవర్గానికి నేటి కాలానికి లోకల అభ్యర్థి కంభం విజయరాజు అవడం మన ఈందరి అదృష్టంగా భావిస్తున్నానని చింతలపూడి మాజీ ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్ శ్రీనివాస రావు అన్నారు.
స్థానిక సమస్యలు తనకు తెలుసునని వాటన్నిటిని పరిష్కారం చేయడం కోసం తన వంతు కృషి చేస్తానని వైఎస్ఆర్సిపి చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కన్వీనర్ కంభం విజయ రాజు అన్నారు మంగళవారం రామన్నపాలెం రోడ్డులోని మారుతి నగర్ వద్ద జరిగిన వైయస్సార్ పార్టీ అభిమానుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నవరత్నాల సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న రోజులలో పార్టీ కోసం ఆయన అన్నారు ఏలూరు జిల్లాలోని కోటగిరి శ్రీధర్ తన అన్యులతో తనకు పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా తనకున్నటువంటి గణాన్ని అప్రమత్తం చేసి చింతలపూడి నియోజకవర్గపు గెలుపు కోసం పాటుపడుతున్న హామీ ఇవ్వడం తనకు కొండంత బలం వచ్చిందని ఆయన అన్నారు. ఇన్నేళ్ల తర్వాత చింతలపూడి నియోజకవర్గంలో చంటిగాడు లోకల్ లాగా తనని లోకల్ క్యాండిడేట్గా ప్రకటించడం మరింత బాధ్యత పెంచిందని ఆయన అన్నారు ప్రతి కార్యకర్తను తన దృష్టిలో ఉంచుకొని కృషి చేస్తానని చెప్పారు అన్ని వర్గాలను సమన్వయ పరుస్తూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత తన భుజస్కందాల పైన ఉందని అందుకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు కూడా సహకరించి తన విజయానికి దోహదపడాలని ఆయన ప్రాధేయపడ్డారు తాను స్థానికుడు అవడం చేత ప్రతి ఒక్కరు కూడా నేరుగా కలవవచ్చునని ఎవరూ కూడా అధైర్య పడొద్దు అని ఆయన అన్నారు. యువకులలో ఉన్న ఉత్సాహాన్ని తనకు మరింత రెట్టింపు ఉత్సాహం కలగజేస్తుందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ముఠాలకు కలహాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరు పనిచేయాలని ఆయన వేడుకున్నారు .ఈ కార్యక్రమంలో మాజీ చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్మన్ మేడవరపు అశోక్ శ్రీనివాసరావు కామవరపుకోట జడ్పిటిసి కడిమి రమేష్ మండలంలోని ఎంపీటీసీలు సర్పంచులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావ సభను విజయవంతం చేశారు.