రామచంద్రపురం, ప్రజాభూమి
రామచంద్రపురం మండలం సికె పల్లి పంచాయతీ చిట్టత్తూరు గ్రామంలో మంగళవారం వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. గ్రామం లోని వృద్ధులు, మహిళలు పిల్లలు ఈ శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా క్యాంప్ ఇంచార్జ్ మస్తాన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయించుకుని కంటికి సంబంధించిన వ్యాధులను నిర్మూలించుకోవాలని, ముఖ్యంగా గ్రామ ప్రజలకు సేవ చేయడానికి వాసం ఐ కేర్ హాస్పిటల్స్ వారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారని, శుక్లము,రెటీనా కంటి చూపు , ఎక్కువగా యువతలో కనబడే సైట్ సమస్యలకు అద్దాలు వాడుకోకుండా లాసిక్స్ ఆపరేషన్ తో నివారించుకోవచ్చు నివారించుకోవచ్చు, క్యాంపు ద్వారా హాస్పిటల్కు వచ్చు పేషెంట్లకు ఉచితంగా సంప్రదించవచ్చు, కంటి ఆపరేషన్ అవసరమైన వ్యక్తులు 17000 ఖర్చుకు గాను 10000 రూపాయలు చెల్లించి ఆపరేషన్ చేసుకోవచ్చని, ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన హాస్పిటల్ వాసన్ ఐ కేర్ హాస్పిటల్ అని, ఎక్కువగా కంటి సమస్య చూపు సమస్య ఉన్నవాళ్లు తిరుపతిలోని హాస్పిటల్లో సంప్రదించవలసిందిగా తెలియజేశారు. ఈ క్యాంపులో ఆప్తో మిస్ట్రైట్ తులసి సాయి పూజ, టెక్నీషియన్లు కే.స్ కృష్ణన్, మొనిషా, సిబ్బంది పాల్గొన్నారు