శ్రీ సత్య సాయి జిల్లా
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలకు తగిన రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు
జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన పెనుగొండ పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన పార్టీ క్యాడర్ సమావేశంలో ఆమె మాట్లాడారు రాష్ట్ర ప్రజల కోసం జగనన్న అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు 124 సార్లు బటన్ నొక్కి ప్రజలకు నేరుగా లబ్ధిదారులఅకౌంట్ లో డబ్బులు వేశారన్నది మరిచిపోకూడదన్నారు జగనన్నను ఎదుర్కొనే దమ్ము ధైర్యం రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి లేదన్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకొనే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు జనసేన బిజెపి పార్టీల పొత్తుకై ఆరాటపడుతున్నాడన్నారు.
జగనన్న చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆయనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురదజల్లే కార్యక్రమాలు చేపట్టుచున్నదన్నారు. జగనన్న ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల వల్ల రాష్ట్రం శ్రీలంక గా మారిపోతుందని విమర్శించిన నాయకులు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం జగనన్న ఇచ్చే పథకాలకు రెట్టింపు పథకాలు ఇస్తామని చెప్పడం ఆస్యాస్పదమన్నారు .ఏవో జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలని చంద్రబాబు అండ్ కో పార్టీ ఉవ్విళ్లూరుతున్నారు రున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. బాబు వస్తే జాబు గ్యారెంటీ, రైతుల రుణమాఫీ వంటి ఎన్నో హామీలను తుంగలో తొక్కారన్నారు .జగనన్న వల్ల లబ్ధి పొందిన ప్రతి ఒక్కరిని పార్టీ క్యాడర్ క్షేత్రస్థాయిలో చైతన్యవంతులుగను చేయాలన్నారు. వాలంటీర్లు యానిమేటర్లు స్టోర్ డీలర్లు ఆశా వర్కర్లు వంటి ఎంతోమంది నిరంతరం కృషి వల్ల ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు. మీరు చేసిన సేవను ప్రజలకు వివరించవలసిన బాధ్యత మీ పైన ఎంతైనా ఉందన్నారు. జగనన్న మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోకపోతే అన్ని వర్గాల ప్రజలు నష్టపోవాల్సి వస్తుందని గుర్తు చేశారు. ప్రతిపక్షాల పార్టీల కుయుక్తులకు తగిన గుణపాఠం నేర్పేలా ఓటర్లను చైతన్యపరచాలన్నారు. సమావేశంలో జడ్పిటిసి శ్రీరాములు పార్టీ మండల కన్వీనర్ నాగలూరు బాబు వైసీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి వెంకట్రామిరెడ్డి శ్రీనివాసులు శ్యామ్ నాయక్ కొండల రాయుడు మండల పరిధిలోని యానిమేటర్లు స్టోర్ డీలర్లు వాలంటీర్లు ఆశ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు