బస్ యాత్రకు బ్రేకులు ..
నిజం గెలవాలి అన్నారంతే
యువగలం హుళక్కే…
జనానికి దూరంగా ఉన్న జనసేనాని
జనంలో కొట్టుకుంటున్న టీడీపీ జనసేన ..
ప్రచారంలో దూసుకెళ్తున్న వైసీపీ
అంతంత మాత్రంగా ఉన్న బీజేపీ
(అంకిరెడ్డిపల్లె రామమోహన్ రెడ్డి ,సీనియర్ పాత్రికేయులు)
ఒక అవమానం ఇంత చేస్తుందా.. ఒంటరి చేయాలని చూస్తే ఇంతటి పరాభవం ఉంటుందా…కుర్రోడు అనుకుంటే కూపీ లాగి మరీ కూతవేటు దూరంలో కూడా లేకుండా చేస్తారా..ఇది విచిత్రమా సాహసమా అంటే ఇవన్నీ అక్షర సత్యాలుగా నిలుస్తున్నాయి నిలిచాయి కూడా.సంకల్పం గట్టిదయితే సాధించలేనిది ఏది లేదన్న లోకొత్తర ధర్మాన్ని చూపించాడు యువనేత,,నవ్యాంధ్రప్రదేశ్ నేటిముఖ్యమంత్రి యేదుగురిసందింటి జగన్మోహన్ రెడ్డి.సుదీర్ఘ రాజకీయ అనుభవం లేదు,గతంలో ఎన్నడూ కూడా ఉన్నత స్థాయి పదవులు అనుభవించ లేదు.రాష్ట్ర స్థాయి పాలనలో సుదీర్ఘ అనుభవంలేదు. తన తండ్రి సుదీర్ఘ రాజకీయ అనుభవం, అనేక మంత్రివర్గ ములో పనిచేసి ఎన్నో మరెన్నో పోరాటాలు చేసిన తరువాత ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో పాదయాత్ర శ్రీకారం చుట్టి ఎన్నో కష్ట నష్టాలు చవి చూసి అధికారం సొంతం చేసుకున్నాడు. అప్పుడే యువ నేత జన బాహుళ్యము లోకి అడుగు పెట్టాడు. దానికి ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరులకు మాత్రమే తెలిసిన వ్యక్తి జగన్.ఆ తరువాత రాజకీయ అరేంగ్రేట్రం చేయడం కడప ఎంపీగా ప్రయాణం మొదలు పెట్టడం వైఎస్ అకాల మరణం, అవినీతి కేసుల్లో 16 నెలలు జైలు జీవితము,రాష్ట్ర విభజన ఇవన్నీ ఒకదానితరువాత ఒకటి చక చక జరిగి పొయాయి. ఇక అసలు కథ అక్కడ నుంచే మొదలు అయ్యింది.రాష్ట్ర రాజకీయల్లో తన సత్తా చాటాలని 175 స్థానల్లో పోటీకి దిగడం 2శాతం ఓట్ల తేడాతో 67 స్థానాలకు పరిమితం కావడం 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడిన అసెంబ్లీలో లక్ష కోట్ల దొంగ అన్నా,ఏ1 అన్నా చక్కటి చిరునవ్వు తో ప్రజాక్షేత్రం లోకి వచ్చి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలతో మమేకమై అధికార పార్టీని 23 స్థానాలకు పరిమితము చేసాడు.45 సంవత్సరాల రాజకీయ అనుభవం దేశ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పిన చంద్రబాబు కు చివరికి జైలు జీవితాన్నీ చూపించాడు.మోడీ జగన్ ఒక్కటే అన్నారు అంటున్నారు.కానీ ప్రజా క్షేత్రం లో ఎన్నో కేసుల్లో స్టేలు ఉన్న చంద్రబాబు ను టచ్ చేసే ప్రయత్నం వైఎస్సార్ కూడా చేసిన విఫలం అయ్యాడని తెలిసిందే.వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అన్నారు.చివరికి స్కిల్ స్కామ్ కేసులో కేవలం 27 కోట్ల అవినీతికి సంబంధించి అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ప్రస్తుతం అనారోగ్యంతో మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు ఉన్నారు.ఏరకంగా చూసిన చంద్రబాబు కు పూర్తి స్థాయి బెయిల్ వస్తుందా అన్న అసలు కూడా కనిపించడం లేదు.పేరు మోసిన న్యాయవాదులతో వాదనలు వినిపించిన అవి చంద్రబాబు కు ఊరట కలిగించలేక పోయాయి. ఎన్నికల సమయం ఆసన్నమైంది.అధికార పార్టీ దూసుకు పోతుంది.ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి జగన్ ఓకే మాట ప్రజల్లో వినిపిస్తూ వస్తున్నాడు.ప్రభుత్వం పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది అన్నారు యువగలం మొదలు పెట్టారు అది అడ్రెస్ లేకుండా పోయింది.చంద్రబాబు జైలుకు పోతానే లోకేష్ యువగలం పక్కన పెట్టారు.లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారని అనుకుని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి అన్నారు.కొన్ని రోజులు తిరిగారు. ఇప్పుడు నిజం గెలిచిందో లేదో తెలియదు చంద్రబాబు అనారోగ్యంతో వైద్యం కొస ఉపశమనం రాగానే ఆ యాత్ర ఊసే లేదు.ఎలాగైనా అధికారంలోకి రావాలని జనసేన తో పొత్తు పెట్టుకున్నారు.లోకేష్ పవన్ కళ్యాణ్ ఉమ్మడి సమావేశం పెట్టారు. ఆ తరువాత ఆ ఊసే లేదు.ఉమ్మడి కార్యాచరణ తో ముందుకు పోతాం అన్నారు ఊరి జనాలముందే ఊసులాడుకొంటున్న పరిస్థితి నెలకొంటుంది. ప్రశ్నిస్తామన్నారు ఉలుకుపలుకు లేదు..అవినీతిపై పోరాటం చేస్తామంటున్న బీజేపీ కి ప్రజాదరణ అంతంత మాత్రమే ఉంది. మరీ ఇక ప్రజలు జగన్మోహనుడుకి జేజేలు కొట్టక ఇంకేమి చేస్తారో ఉభయ పార్టీ ల నేతలే చెప్పాలి. ప్రజాస్వామ్యం లో ప్రజలతో నిత్యం మమేకమై ఉంటే కూడా ప్రజా తిరస్కరణ ఉన్న నేటి పరిస్థితి ల్లో ఏదో కారణాలతో ప్రజల కు దూరంగా ఉంటే ప్రజా విశ్వాసం కోల్పోక తప్పదన్న భావన వ్యక్తమవుతోంది. చూద్దాం మరి జగన్ కు జై అంటారా నై నై అంటార అనేది.