Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుజగన్ తాటాకు చప్పళ్లకు బిటెక్ రవి భయపడరు

జగన్ తాటాకు చప్పళ్లకు బిటెక్ రవి భయపడరు

టిడిపి ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు మేదర రవికుమార్

ప్రజాభూమి, వేంపల్లె
నిరంకుశ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాటాకు చప్పళ్లకు టిడిపి మాజీ ఎమ్మెల్సి, నియోజకవర్గ ఇంచార్జీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి(బిటెక్ రవి)భయపడరని ఆ పార్టీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు మేదర రవికుమార్ అన్నారు. శనివారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద టిడిపి కార్యకర్తలతో కలిసి బిటెక్ రవి అక్రమ అరెస్టుకు ప్లే కార్డులతో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బిటెక్ రవిని పోలీసులు అరెస్టు చేయడం దారుణమన్నారు. టిడిపి ఆధ్వర్యంలో చేపట్టిన బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి, బాబు షూరిటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో నుంచి మంచి స్పందన వచ్చిందని, వైకాపా పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందని, అడుగడుగునా ప్రజలు బిటెక్ రవికి మంగళ హారతులు పట్టారన్నారు. దీంతో వైకాపా ప్రభుత్వానికి ఓటమి భయం పెట్టుకుందన్నారు. బిటెక్ రవికి ప్రజల్లో నుంచి వస్తున్న ఆదరణను ఓర్వలేక వైకాపా ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు చర్యకు పాల్పడినట్లు ఆరోపించారు. వైకాపా ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు టిడిపి వైపు ఉన్నారని, రానున్నది టిడిపి ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రామచంద్ర, దేవేంద్ర, హరికృష్ణ, కృష్ణ నాయక్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article