జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు
కడప సిటీ:రాష్ట్రంలోని బీసీలు బ్రాహ్మణులందరూ వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో పేదలను చంపి వాళ్ళ రక్తం తీసుకొని అన్నంలో కలుపుకొని తినే సంస్కృతి ఉందని ధ్వజమెత్తారు. ప్రపంచానికి నాగరికత నేర్పిన చేనేతలను అతి దారుణంగా హింసించి వేధిస్తూ అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారని వైకాపా పాలనపై విరుచుకుపడ్డారు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే మాదిరిగా కాకినాడశివాలయంలోఅర్చకులపైదాడిదుర్మార్గంఅన్నారు. శివాలయంలో అర్చకులుగా పనిచేస్తున్న సాయి శర్మ, విజయ్ కుమార్ శర్మ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన నిందితుడికి మద్దతిస్తున్న ఆలయ ఈవో, కాకినాడ జిల్లా దేవాలయ శాఖ అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పుడు నుండి అర్చకులపై దాడులు పెరిగాయన్నారు. బ్రాహ్మణ సంక్షేమాన్ని తుంగలో తొక్కిన వైకాపాకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలనిపిలుపునిచ్చారు.త్రాగునీటి సమస్యను పరిష్కరించడం లో జిల్లా అధికారులు వైఫల్యం చెందారన్నారు.జిల్లాలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని జిల్లా అధికారులను కోరారు. వైయస్సార్ జిల్లాలోని 36 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరారు.