అధికారం కోసం జగన్ రెడ్డి చేసిన పాపాలే జగన్ రెడ్డిని జైలుకి పంపుతాయి
కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు
ప్రజాభూమి కాకినాడ
జగన్ రెడ్డి అవినీతి అరాచక పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగి వేసారి పోయారని, అధికారం కోసం జగన్ రెడ్డి చేసిన పాపాలే జగన్ రెడ్డిని చర్లపల్లి జైలుకి పంపుతాయిని, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో ప్రయాణించాలంటే సైకో పాలను పోయి తెలుగుదేశం పార్టీ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సోమవారం నియోజవర్గ ఇన్చార్జ్ వనమాడి కొండబాబు అధ్యక్షతన ఓటర్ వెరిఫికేషన్, హౌస్ మ్యాపింగ్, ఐ టి డి పి, రైట్ టైం స్ట్రాటజీ, సోషల్ మీడియా తదితర అంశాలపై కాకినాడ సిటీ నియోజకవర్గ క్లస్టర్, యూనిట్, బూత్ కన్వినర్ లకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి విశ్లేషకులుగా సాయి దత్త, శివశంకర్, దినేష్ వర్మ, హాజరై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మాట్లాడుతూ అధికారం కోసం సొంత బాబాయిని హత్య చేయించి, కోడి కత్తి డ్రామా నడిపించి అధికారంలోకి వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ అని, అధికారం కోసం జగన్ రెడ్డి చేసిన పాపాలతో నేడు మరల జగన్ రెడ్డిని చర్లపల్లి జైలుకి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నాయని, వైసిపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగివేసారి పోయిన రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని, రాష్ట్రంలో అభివృద్ధి, పరిపాలన గాడిలో పెట్టటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు గర్వపడే విధంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారుతోనే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని, కాబట్టి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి కృషి చేయాలని, ప్రతి క్లస్టర్, యూనిట్, డివిజన్ కమిటీలు, మరియు బూతు కన్వీనర్లు అందరూ కష్టపడి పని చేసి, వైసిపి ప్రభుత్వ అవినీతి అరాచక పాలనను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని, వైసిపి ప్రభుత్వం అవినీతి పరిపాలనను సోషల్ మీడియా పరంగా ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, గ్రంధి నారాయణరావు, గదులు సాయిబాబా, నృసింహదేవర విశ్వనాధం, తాజుద్దీన్, కలగా శివరాణి, బచ్చు శేఖర్, అమన్ జైన్, పైలా రామకృష్ణ, ఎండీ ఖాన్, రహీమ్, ఎం.డీ ఆన్సర్, చిక్కాల సత్యవతి, మల్లిపూడి దీపిక, మీసాల సునీత, అంబటి క్రాంతి, పలివెల రవి, ఉమ్మి బాలాజీ, బంగారు సత్యనారాయణ, గుజ్జు లక్ష్మణరావు, అంబటి చిన్న, హోతా రవి, పిల్ల లక్ష్మీ ప్రసన్న, నాగ కుమారి, పంతాడి రాజు, రేకాడి లోవరాజు, చింతలపూడి రవి, గెడ్డం పూర్ణ, గుత్తుల రమణ, చింతా పేర్రాజు, పసుపులేటి వెంకటేశ్వరరావు, తుమ్మల కొండలరావు, పి. శేషగిరిరావు, మేడిశెట్టి చిన్న, పాలిక నాని, దుర్గారావు, రామలింగేశ్వరరావు, బలరామ్, సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.