Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుజగన్ రెడ్డి పాలనలో ప్రజలు ఏం కొనేట్టు లేదు..ఏం తినేట్టు లేదు

జగన్ రెడ్డి పాలనలో ప్రజలు ఏం కొనేట్టు లేదు..ఏం తినేట్టు లేదు

•టీడీపీ హాయాంలో నలుగురుసభ్యులున్న కుటుంబానికి నెలకు నిత్యావసరాలకు రూ.2వేలు ఖర్చయితే, ఇప్పుడు రూ.8వేలు ఖర్చవుతున్నాయి.
•జగన్ రెడ్డి ధరల పెంచడంతో ఒక్కో పేద కుటుంబంపై సంవత్సరానికి రూ.60వేల భారం పడింది. : నిమ్మల రామానాయుడు

అమరావతి:శాసనసభ నుంచి సస్పెండ్ అయిన అనంతరం నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు.. “ఆకాశాన్ని అంటిన నిత్యావసర ధరలు, పెరిగిన పన్నులు, ప్రభుత్వం పెంచిన వివిధ రకాల ఛార్జీలపై చర్చచేపట్టాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ తరుపున ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. మహిళలు, పేదల పక్షాన టీడీపీ సభ్యులు మాట్లాడకూడదు అన్న దురుద్దేశంతోనే మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఏం కొనేట్టు లేదు.. తినేట్టు లేదు అనే సినిమా పాట ప్రస్తుతం పేదల బతుకులకు సరిగ్గా సరిపోతుంది. ధరల మోత – పన్నుల వాత ఇదే జగన్ రెడ్డి మార్క్ పాలన. టీడీపీప్రభుత్వంలో లీటర్ పెట్రోల్ రూ.72లు ఉంటే, ఇప్పుడు రూ.112లు అయ్యింది. లీటర్ డీజిల్ అప్పుడు రూ.69లు ఉంటే, ఇప్పుడు రూ.99కి పెరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది కేంద్రప్రభుత్వమని జగన్ సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రప్రభుత్వ వాటాగా ఉన్న ట్యాక్స్ లను 32 శాతం నుంచి 35శాతానికి పెంచింది జగన్ రెడ్డే. రాష్ట్రంలో పెంచిన పన్నుల వల్లే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే లీటర్ పై రూ.8 నుంచి రూ.10లు అదనపు భారం ప్రజలపై పడింది. టీడీపీప్రభుత్వంలో కేజీ బియ్యం రూ.40లు ఉంటే, ఇప్పు డు రూ.55 ఉంది. కందిపప్పు గతంలో రూ.80లు ఉంటే, ఇప్పుడు రూ.120కి పెరిగింది. కేజీ చింతపండు టీడీపీప్రభుత్వంలో రూ.120లు అమ్మితే, ఇప్పుడు రూ.240లకు పెరిగింది. ఇలా పంచదార, వంటనూనె, ఇతర పప్పుల ధరలు పె రిగాయి. చంద్రబాబు హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.600లు ఉంటే, ఇప్పుడు రూ.1200లకు ఎగబాకింది. పెరిగిన గ్యాస్ ధరలతో మహిళలు మరలా కట్టెలపొయ్యిలను నమ్ముకుంటున్నారు. కరెంట్ బిల్లుల్ని జగన్ రెడ్డి 9సార్లు పెంచాడు. గతంలో రూ.200లు వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు తక్కువలో తక్కువగా రూ.1000లు వస్తోంది. మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి మహిళలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, కల్తీ మద్యం అధిక ధరకు అమ్ముతూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. క్వార్టర్ నాసిరకం మద్యాన్ని రూ.200లకు అమ్మిస్తున్నాడు. ఇవన్నీ చాలవన్నట్టు ఆస్తిపన్ను, నీటిపన్ను, మరుగుదొడ్లపై పన్ను అంటూ ఆఖరికి చెత్తపై కూడా పన్నులు వేసిన ఈ ప్రభుత్వం చెత్త ప్రభుత్వంగా పేరు పొందింది. రేషన్ దుకాణాల్లో బియ్యం తప్ప మరేమీ పేదలకు ఇవ్వడంలేదు. కొన్ని చోట్ల ఆ బియ్యం కూడా సరిగా ఇవ్వడం లేదు. గతంలో చంద్రబాబు హాయాంలో బియ్యంతో పాటు, కంది పప్పు, పంచదార, నూనె ప్యాకెట్, చింతపండు, బెల్లం వంటి 6 రకాల సరుకుల్ని సగం ధరకు అందించడం జరిగింది. 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలో నలుగురు సభ్యులున్న కుటుంబం కేవలం నిత్యావసరాలకే నెలకు రూ.7నుంచి రూ.8వేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి దాపురించింది. అదే కుటుంబం టీడీపీప్రభుత్వంలో నిత్యావస రాలకు రూ.2వేలు మాత్రమే వెచ్చించింది. రూ.5వేలు నిత్యావసరాలకే అదనంగా ఖర్చు చేయడం అంటే సంవత్సరానికి రూ.60వేల కష్టార్జితాన్ని ఒక్కో కుటుంబం కోల్పోతోంది. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబడితే, వాస్తవాలు ప్రజలకు తెలియకూడదన్న దురుద్దేశంతో, కుట్రతోనే చర్చ చేపట్టకుండా మమ్మల్ని అన్యాయంగా సస్పెండ్ చేశారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు శాశ్వతంగా రాష్ట్రం నుంచి సస్పెండ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.” అని రామానాయుడు తేల్చిచెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article