అనంతపురము
జిల్లా ఎస్పీ కేకేఎన్.అన్బురాజన్ ఆదేశాలతో పోలీసులు ఆదివారం జిల్లా అంతటా “కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు” నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణ కాలనీల్లో తనిఖీలు చేపట్టారు. డీఎస్పీలు, సి.ఐ.లు, ఎస్సైల ఆధ్వర్యంలో పాత నేరస్తులు, రౌడీషీటర్లను, కర్నాటక మద్యం, నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం అనుమానితులు, పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో, పశువుల పాకలు, గడ్డివాము ప్రాంతాల్లో
పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానితుల వివరాలను లోతుగా చెక్ చేశారు. ఆయా గ్రామాలలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. గ్రామసభలు నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని సూచించారు. ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని పోలీసులు కోరారు. అలాగే, సాయంత్రం… జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు చేపట్టి రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనదారులపై చర్యలు తీసుకున్నారు. ఎలాంటి సంఘ వ్యతిరేక సరుకులు వస్తువులు, మద్యం వంటివి అక్రమ రవాణా జరుగకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.