సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర
కడప సిటీ: కడప పట్టణంలోని జిల్లా పరిషత్ షాపింగ్ కాంప్లెక్స్ రూములు కేటాయింపుల్లో అక్రమాలకు పాల్పడిన జడ్పి సీఈవో సుధాకర్ రెడ్డి ని సస్పెండ్ చేయాలని, నిబంధనలు అతిక్రమించిన చైర్మన్ ను బర్తరపు చేయాలని గాలి చంద్ర డిమాండ్ చేశారు.
జిల్లా పరిషత్ నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్లో రూముల కేటాయింపులో, ఆఫీస్ రెన్యువేషన్లో, స్క్రాబ్ అమ్మకంలో, అన్నా క్యాంటీన్లను ప్రవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో ఏకపక్షంగా వ్యవహరించి జిల్లా పరిషత్ ఆదాయానికి గండికొట్టిన జడ్.పి సిఈఓ సుధాకర్రెడ్డిని సస్పెండ్ చేయాలని, జడ్.పి చైర్మెన్ను బర్తరఫ్ చేయాలి అని సోమవారం స్థానిక కలెక్టరేట్లోని డి ఆర్ ఓ కు వినతి పత్రం సమర్పించిన అంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ
కడప నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయానికి కుడి వైపున నిర్మిస్తున్న కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్ రూములు బహిరంగ వేలం పిలవకుండానే పై అంతస్తులో బీరం శ్రీధర్రెడ్డి విద్యాసంస్థలకు చెందిన బ్యానర్ కట్టడం జరిగింది. దీనిపై జడ్.పి సిఈఓ సుధాకర్రెడ్డి గారిని అడుగగా కాంప్లెక్స్ పైబాగాన్ని బీరం శ్రీధర్రెడ్డి విద్యాసంస్థలకు కేటాయించడం జరిగిందని చెప్పడం జరిగింది. అదేంటి క్రింది రూములు బహిరంగ వేలం పిలవకుండా, పై అంతస్తు పూర్తి కాకుండా, బహిరంగ వేలం, టెండర్ పిలవకుండా ఒక విద్యాసంస్థకు ఏకపక్షంగా కేటాయిస్తారని ప్రశ్నించగా కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుండగా బీరం విద్యాసంస్థల యాజమాన్యం వచ్చి తమను సంప్రదించిందని, తమకు పై అంతస్తు పూర్తిగా కేటాయిస్తే అందుకు తాము నిర్మాణానికి అవసరమయిన నిధులు ముందుగా చెల్లించడమే కాకుండా చదరపు అడుగకు 20రూపాయలు చెల్లిస్తామని చెప్పడంతో ఆర్అండ్ రేట్లతో పోల్చినప్పుడు ఇది ఎక్కువగా ఉండటంతో ఈ విషయాన్ని జిల్లా పరిషత్ చైర్మెన్ దృష్టికి తీసుకుపోయి స్టాండింగ్ కౌన్సిలో అమోదం తెలపడం జరిగిందని చెప్పారు. గతంలో ఎక్కడైనా స్థానిక సంస్థలయినా, ప్రభుత్వ సంస్థలయినా తాము చేపట్టిన కాంప్లెక్స్లో బహిరంగ టెండర్/ వేలం ద్వారా ఎక్కువ ఆదాయాన్ని గడించడం జరుగుతుంది. కానీ జిల్లా పరిషత్ కాంప్లెక్స్ కేటాయింపులో ఈ విధానం అమలు చేయకుండా సిఈఓ, చైర్మెన్ యాజమాన్యంతో మిలాఖత్ అయి బహిరంగ వేలం వేయకుండా ఏకపక్షంగా కేటాయించి ఆదాయానికి గండికొట్టడం జరిగింది. వ్యాపార సముదాయంలో విద్యాసంస్థల ఏర్పాటు బద్రతకు, శాంతియుత వాతావరణం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారన్న ఆలోచన కూడా లేకుండా కేటాయించడం విచారకరం.
జిల్లా పరిషత్ కార్యాలయం రెన్యువేషన్ పేరుతో కార్యాలయంలో ఉన్న విలువైన సామాగ్రిని అమ్ముకున్నట్లు ఆరోపనలు కూడా ఉన్నాయి.
జిల్లా పరిషత్ క్వార్టర్స్లో ఉన్న భారీ చెట్లను తొలగించి అక్కడ కూడా ఏకపక్షంగా హాస్పిటల్కు కేటాయిస్తున్నట్లు, కాదు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపనలు ఉన్నాయి.
ఒక వైపు ఆరోపనలు వస్తున్నప్పటికీ మరో వైపు అన్నా క్యాంటీన్ స్థానంలో ప్రవేటు హెూటల్ ఏర్పాటు చేయడం అభియోగాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది.
కాంప్లెక్స్ నిర్మాణం, ఆపీస్ రెన్యువేషన్ లో సిఈఓ బినామి టెండర్తో తానే పనులు చేస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడని అభియోగాలున్నాయి.
ప్రభుత్వ నిభిందనలను పాటించకుండా, అభియోగాలను లెక్కచేయకుండా జిల్లా పరిషత్ ఆదాయాన్ని గండికొట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతన్న సిఈఓన సస్పెండ్ చేసి, చైర్మెన్ ను బర్తరఫ్ చేయాలని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ వెంకట శివ, యం. వి సుబ్బారెడ్డి, వి గంగా సురేష్, తదితరులు పాల్గొన్నారు.