Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుజిల్లా పరిషత్ నూతన కాంప్లెక్స్ బీరం శ్రీధర్ రెడ్డి కాలేజీకి అంతర్గత ఏకపక్ష కేటాయింపు రద్దు...

జిల్లా పరిషత్ నూతన కాంప్లెక్స్ బీరం శ్రీధర్ రెడ్డి కాలేజీకి అంతర్గత ఏకపక్ష కేటాయింపు రద్దు చేయాలి

కడప సిటీ:వ్యాపార సముదాయంలో విద్యాలయాల ఏర్పాటు అనుమతి నిరాకరించాలి,
జడ్పీ సీఈవో సుధాకర్ రెడ్డి చేపట్టిన పనులపై, ఆస్తులపై విచారణ జరిపించాలి
జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆందోళనలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్
చేశారు.వైయస్ జగన్ పాలనలో విలువైన భూములన్నీ ఆక్రమించడమే కాకుండా దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకున్న చందాన వైసిపి నేతల కన్ను ప్రభుత్వ ఆస్తులపై పడిందని ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో జిల్లా పరిషత్ కార్యాలయం అక్రమాలకు అడ్డగా మారిందని తన కాంప్లెక్స్ నిర్మాణ మాటున ఏకపక్షంగా కొట్టేసేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పి కొడతామని,తక్షణం బీరం శ్రీధర్ రెడ్డి కళాశాలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని, సోమవారం కడప జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన లో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్తు సీఈఓ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్తు స్థలాల్లో కాంప్లెక్స్ ల నిర్మాణానికి పూనుకొని ఎలాంటి టెండర్లు లేకుండా అన్నీ తానై చకచకా నడిపిస్తూ కాంప్లెక్స్ ల నిర్మాణం మాటున భారీ అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఎలాంటి నిర్మాణాలైనా స్థానిక సంస్థల అనుమతి తీసుకోవాల్సి ఉండగా,నగరంలో నగరపాలక సంస్థ అనుమతి లేకుండా, కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి గుట్టు చప్పుడు కాకుండా బీరం శ్రీధర్ రెడ్డి కళాశాల యాజమాన్యంతో లోపాయికారి ఒప్పందం చేసుకొని బహిరంగ వేలం నిర్వహించకుండానే కట్టబెట్టడం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ కాంప్లెక్స్ ల నిర్మాణం అనంతరం బహిరంగ వేలం నిర్వహించడం ద్వారా ఆయా సంస్థల ఆదాయాన్ని పెంచుకునేందుకు అవకాశం ఉందన్నారు.కానీ కడప జిల్లా పరిషత్ పాలకవర్గం అందుకు భిన్నంగా ఏకపక్షంగా కేటాయించడం జిల్లా పరిషత్ ఆదాయానికి గండి కొట్టడమే అన్నారు. కాంప్లెక్స్ క్రింది భాగంలో ఉన్న రూములను వ్యాపారాలకు బహిరంగ వేలం ద్వారా కేటాయిస్తామని చెబుతున్న జిల్లా పరిషత్తు పై అంతస్తు బాగానే ఎందుకు బహిరంగ వేలం పిలవలేదని వారు ప్రశ్నించారు. కాంప్లెక్స్ వ్యాపార సముదాయానికి కేటాయిస్తే, మరోవైపు ఎదురుగా ప్రధాన రహదారి, రైతు బజారు నిత్యం రద్దీగా ఉన్న ప్రదేశాన్ని విద్యాలయం ఏర్పాటుకు ఏ విధంగా కేటాయిస్తారని, విద్యాశాఖ అధికారులు ఏ విధంగా అనుమతి ఇస్తారని వారు ప్రశ్నించారు.
జిల్లా పరిషత్ కార్యాలయం రెన్యూవేషన్ పేరుతో ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ, కార్యాలయంలోని ఫర్నిచర్, విలువైన సామాగ్రిని అమ్మడంలో కూడా అక్రమాలు జరిగాయన్నారు. జిల్లా పరిషత్ ఆవరణాన్ని అడ్డగోలు నిర్మాణాలు చేపట్టి అయినవారికి కట్టబెట్టి అందులో వచ్చే ఆదాయాన్ని వ్యక్తిగత ఆదాయానికి జమ చేసుకుంటూ విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టపెట్టాలని చూస్తున్న జడ్పీ సీఈవో సుధాకర్ రెడ్డి అక్రమాలపై, ఆస్తులపై విచారణ జరిపించి సస్పెండ్ చేయాలని లేకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎన్ వెంకట్ శివ, పి చంద్రశేఖర్, మహిళా సమాఖ్య సి బసురునిస, సహాయ కార్యదర్శి కేసి బాదుల్లా, జి మద్దిలేటి, సావంత్ సుధాకర్, కె మునయ్య, జి వలరాజు, పి మల్లికార్జున, లింగన్న, బ్రహ్మం, ఆర్ బాబు, రామ్మోహన్ రెడ్డి, సుబ్బరాయుడు,అంకుశం, నాగిరెడ్డి, యేసు రత్నం, హుస్సేన్, మున్ని,కొండయ్య, తేజ, అరుణ్, గంగాధర్, పకీరప్ప తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article