Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుజీవన మనుగడకు భరోసా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా.

జీవన మనుగడకు భరోసా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా.

మృతుని కుటుంబానికి బీమా నగదు అందజేత.

ప్రజాభూమి, వేలేరుపాడు.
పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల జీవన మనుగడకు భరోసా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా అని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ కె.మదన్మోహన్ అన్నారు. మండలంలోని రెడ్డిగూడెంలో ఇటీవల మరణించిన కరటం పుల్లయ్య భార్య రమాదేవికి బుధవారం బీమా నగదు రూ.2 లక్షలు అందించారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ మదన్మోహన్ మాట్లాడుతూ కరటం పుల్లయ్య గ్రామీణ వికాస్ బ్యాంక్ నందు ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా 420 రూపాయలు చెల్లించారని, దురదృష్టవశాత్తు మరణించిన పుల్లయ్య కుటుంబానికి రెండు లక్షల రూపాయల బీమా నగదు చెల్లిస్తున్నట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి వర్గాల్లో కుటుంబానికి ఆధారంగా ఉన్న సంపాదించే వ్యక్తులు దురదృష్టవశాత్తు అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబాల మనుగడకు బీమా అత్యావస్యకమని అన్నారు. ప్రజలందరూ అవగాహనతో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఛానల్ మేనేజర్ అఖిల్, బ్యాంకు మిత్ర కుచ్చులపాటి శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article