యనమల కృష్ణుడు
తుని
తుని మండలంలో వైసీపీ నుంచి తెలుగు దేశం పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.యనమల దివ్యకు 30వేల మెజార్టీపై గురి పెట్టిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు ఆదిశగా సర్వశక్తులు ఒడ్డుతున్నారు.అధికార పార్టీ కార్యకర్తలకు గాలం వేసి సైకిల్ ఎక్కిస్తున్నారు.ఇందులో భాగంగా
తుని మండలం, ఎస్. అన్నవరం పంచాయతీ టీడీపీ నాయకులు ఆకుల రాజు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు ప్రగడ వీరబాబు, ప్రగడ శేషగిరి, బొడ్డ ప్రసాద్, బోణం నవీన్, జావధుల మణి, అక్కిరెడ్డి సాయి, యాడగల శ్రీను, ఆకుల చందు, చోడిశెట్టి పండు, చోడిశెట్టి నాని, బోణం గణేష్ వారితోపాటు 50 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జాయినింగ్ అయ్యారు.
వీరికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు పసుపు కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కో ఆర్డినేటర్ పోల్నాటి శేషగిరిరావు గారు, తుని మండల పార్టీ అధ్యక్షుడు అప్పన రమేష్, జనసేన పార్టీ సమన్వయ కర్త చోడిశెట్టి గణేష్, టీడీపీ నాయకులు మోతుకూరి వెంకటేష్ గారు, మాజీ మండల ప్రెసిడెంట్ వంగలపూడి బుజ్జి, వంగలపూడి శ్రీనివాస్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, చింతంనీడి విజయ్,నెమల చిట్టిబాబు, గట్టెం సాయి, ప్రగఢ బాబీ, యాళ్ల కృష్ణ, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.