Sunday, April 20, 2025

Creating liberating content

తాజా వార్తలుజెలెన్ స్కీని చంపడం తప్ప వేరే మార్గం లేదు.. రష్యా తీవ్ర హెచ్చరిక..

జెలెన్ స్కీని చంపడం తప్ప వేరే మార్గం లేదు.. రష్యా తీవ్ర హెచ్చరిక..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అంతమొందించడానికి మాస్కోలోని అధ్యక్ష భవనంపై డ్రోన్ అటాక్ ప్రపంచాన్ని కలవరపరిచింది. ఈ ఘటనకు ఉక్రెయిన్ కారణం అని, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ పథకం ప్రకారమే పుతిన్ ను అంతమొందించడానికి ప్రయత్నించాడని రష్యా పార్లమెంట్ ఆరోపించింది.తమకు ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉందని రష్యా తీవ్ర స్వరంతో హెచ్చరించింది.ఇదిలీా ఉంటే రష్యా భద్రతా మండి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని, అతని సమూహాన్ని చంపడం తప్ప మరోమార్గం రష్యాకు లేదని ఆయన అన్నారు. పుతిన్ ను అంతమొందిచడానికి చేసిన దాడి తర్వాత జెలన్ స్కీని భౌతికంగా తొలగించడం తప్పా మాకు మరో మార్గం లేదని అతని టెలిగ్రామ్ ఛానెల్ లో చెప్పారు. జెలన్ స్కీ బేషరతుగా లొంగియేందుకు సంతకం చేయాల్సిన అవసరం కూడా లేదని ఆయన అన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేయడానికి ఉక్రెయిన్ ప్రయత్నాలు జరిగాయని, ఇది “ఉగ్రవాద దాడి” అని ఆరోపిస్తూ, పుతిన్ నివాసంపై డ్రోన్‌లను కాల్చివేసినట్లు పేర్కొంది. రష్యా ఆరోపణల ప్రకారం.. క్రెమ్లిన్‌లోని పుతిన్ అపార్ట్‌మెంట్‌ను ఢీకొట్టాలనే ఉద్దేశ్యంతో ఉక్రెయిన్ రాత్రిపూట రెండు డ్రోన్లతో దాడులను ప్రారంభించిందని రష్యా పేర్కొంది. అయితే ఆ సమయంలో పుతిన్ భవనంలో లేరని క్రెమ్లిన్ అధికార ప్రతినిది డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. డ్రోన్లను ముందుగానే గుర్తించి ధ్వంసం చేశామని రష్యా తెలిపింది. అయితే రష్యా చేస్తున్న ఈ ఆరోపనల్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఖండించారు. పుతిన్ పై తాము దాడి చేయలేదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article