TSPSC చైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఆయన ఎంపిక ద్వారా నిరుద్యోగుల్లో నమ్మకాన్ని ఏర్పరచడంతో పాటు నియామక ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని..చైర్మన్‌గా ఆయన పేరును ప్రతిపాదిస్తూ ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించినట్టు సమాచారం. గవర్నర్ ఆమోదించిన వెంటనే ఆయన చైర్మన్‌గా నియమితులు కానున్నారు. డీజీపీగా పనిచేసి రిటైరైన వారిలో 62 ఏళ్లలోపు ఉన్న మాజీ అధికారి మహేందర్ రెడ్డి మాత్రమే ఉన్నారు. చైర్మన్ పోస్టుకు ఆయన పేరునే ప్రభుత్వం ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.