కామవరపు
కామవరపు కోట లక్షలాది మంది రైతులు ట్రాక్టర్లు ట్రక్కులపై భారత రాజధాని న్యూఢిల్లీలో తమ న్యాయమైన హక్కుల సాధన కోసం కవాతు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తుందని ఏఐటియుసి ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కంకిపాటి బుచ్చిబాబు చింతలపూడి ఏరియా గౌరవ అధ్యక్షుడు టీవీఎస్ రాజు సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ తలారి ప్రకాష్ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక రైతాంగ ఐక్య కూటమి గ్రామీణ బందుకు ఇచ్చిన పిలుపులో భాగంగా కామవరపుకోటలో పలువురు కార్మికులు గ్రామీణ బందులో పాల్గొన్నారు బంద్ సందర్భంగా కామవరపుకోట చౌతి నా సెంటర్ నుండి దుర్గా మహల్ సెంటర్ వరకు రైతుల కార్మికులు ర్యాలీ ధర్నా నిర్వహించారు. మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో గల రైతులు రేయింపగళ్ళు కష్టపడి లక్షలాది టన్నుల ఆహార ధాన్యం పండిస్తే రైతుకు గిట్టుబాటు ధర అందించకుండా కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఊడిగం చేస్తుందని విమర్శించారు మతోన్మాది నరేంద్ర మోడీ తాను ప్రధానమంత్రి రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం ద్వారా రైతు పండించిన పంటకు గిట్టుబాటు మద్దతు ధర ఇవ్వటం కోసం కేంద్రం ప్రత్యేక జీవో చేయాలన్నారు రైతాంగానికి రుణ విమోచన చట్టాన్ని ఆమోదించి అప్పుల పాలైన రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా నివారించాలన్నారు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజన తదితర స్కీం వర్కర్లకు నెలకు 26 వేల రూపాయలు కనీస వేతనంగా ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు చల మాల శ్రీనివాసరావు, మీనుగుల దుర్గారావు,ఏఐటీయూసీ నాయకులు బాలిన రమణారావు, బివి రాఘవులు, కోతాటి వెంకటేశ్వరరావు,నల్లమోతుల అప్పన్న, పిల్లి ప్రసాద్, నల్లమోతుల అప్పన్న, వెలుగు సూరి పండు పార్టీల పాకిన సత్యనారాయణ కే రాంబాబు తదితరులు పాల్గొన్నారు.