5 వేలకు డాక్టరేట్ ఇస్తారా
6 వేలకు నంది,మహానంది అవార్డులు ఇస్తారా
3500లకు బంగారు నంది అవార్డులు ఇస్తారా
నకిలీ డాక్టరేట్ల కోసమే కళా పీఠాలు ఉన్నాయా
ప్రభుత్వ ఉద్యోగులు,రిటైర్డు ఉద్యోగులకు డాక్టరేట్ లు వస్తాయా…
రాజ్యాంగం లో ఇటీవల మార్పులేమైనా చేశారా
కౌతాళం నకిలీల భాగోతం అరికట్టేదెవరు…
విజయవాడ:చదువుల తల్లి ఇప్పటికే చదువుల పేరిట కార్పొరేట్ సంస్థలు అంగడిలో వస్తువులు అమ్మకాలు జరిపినట్లు చేస్తుంటే మేమేమి తక్కువ కాదంటూ కొంతమంది విద్యావంతుల ముసుగులో తామే మేధావులంటూ డాక్టరేట్ ల వ్యాపారంకు తెరలేపారు. తెలుగు రాష్ట్రాలకు ప్రక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు లో ఉన్న బోగస్ యూనివర్సిటీ లు ఇటీవల డాక్టరేట్ల ప్రధానానికి తెరలేపాయి.ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చికుని ఆశావాహులకు ఎర వేస్తూ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.ఆధునిక సమాజంలో తాము కూడా ఉన్నతమైన వ్యక్తులగా చెలామణి అవ్వుటకు ఇలాంటి డాక్టరేట్ లను పుచ్చుకుని తమ పేరు ముందూ డాక్టరేట్ ను ఉదహరిస్తూ బ్రతుకు సాగిస్తున్నారు.ఈ రంగంలో కొంతమంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లో పనిచేస్తున్న, పనిచేసిన కొంతమంది అధికారులు కూడా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఇదొక వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించి చివరికి బెజవాడ కళారంగానికి అంటుకుని పేద కళాకారుల జీవితాలతో కొంతమంది చెలగాటం ఆడటం మొదలు పెట్టారు. ఇందుకు కౌతాళం వేదిక కావడం గమనార్హం. పేద కళాకారుల కోసం ఏర్పాటు చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖ పర్యవేక్షణ లో ఉన్న కళావేదిక ఇందుకు మూలంగా తయారు కావడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే తమ ఆర్థిక ప్రయోజనాల కోసం కళావేదికలు ఏర్పాటు చేసుకున్నారన్న బహిరంగ విమర్శలు బోలెడు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో 5 వేల రూపాయలకు డాక్టరేట్,6 వేలకు నంది,మహానంది,3500 రూపాయలకు వివిధ రకాల పేరుతో డబ్బులు దండుకుంటూ ఓ పత్రం,ఓ బిళ్ళ, ఓ మెమెంటో చేతిలో పెట్టి ఇక మీరు గొప్ప కళాకారులు లెక్కలో చేరి పోయారని అమ్మవారి ముందు బలికి సిద్ధంగా ఉన్న మూగ జీవుల్లా తయారు చేసి పేద కళాకారుల జీవితాలతో అటాడుకుంటున్న తీరు చూసి ఫక్కున నవ్వుతోంది కలమతల్లి.ఇలాంటి ఒక్కొక్క దారుణ విషయాలు వెలుగు చూస్తుండటంతో డబ్బులు పొగుట్టుకుని అన్యాయం కు గురి అయ్యామని ఆవేదన చెందుతున్నారు పేద కళాకారులు. ఇప్పటికయినా ప్రభుత్వ అధికారులు కలామతల్లి ముసుగులో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కలకారులు వేడుకొంటున్నారు.