ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రూ.128.79 కోట్ల నగదు సీజ్ చేశామని ఈడీ తెలిపింది. ఈ మేరకు ఈడీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఇప్పటివరకు దేశంలో 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. రూ.128.79 కోట్ల నగదు సీజ్ చేశామని తెలిపింది. ఢిల్లీ, హైదరాబాద్, ముంబయి, చెన్నైలో సోదాలు చేపట్టామని… ఈ కేసులో మనీశ్ సిసోడియా, సంజరు సింగ్, విజరు నాయర్, కవిత సహా ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశామని తెలిపింది. హైదరాబాదులోని కవిత నివాసంలో ఈ నెల 15న సోదాలు జరిపామని, సోదాల సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించారని పేర్కొంది. ఆప్ నేతలతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని స్పష్టం చేసింది.