బుట్టాయగూడెం.
విశాఖపట్నం రూరల్ తహసిల్దార్ సనపల రమణయ్య హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట శనివారం సిబ్బంది నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తహసిల్దార్ రమణయ్య ఇటీవలే విజయనగరం జిల్లా బంటుపల్లి కి బదిలీ అయ్యారని తెలిపారు. నిందితులు కక్షతో రమణయ్యపై దాడి చేసి, కొట్టి చంపారని, ఈ సంఘటనతో రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడిందని అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. హత్యకు గురైన రమణయ్య కుటుంబానికి ప్రభుత్వం తగిన విధంగా న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ కె. రమేష్, ఏ ఎస్ ఓ వీరేంద్ర, సిఎస్ ఆర్ ఐ కుంజం పద్మ, సీనియర్ అసిస్టెంట్ కుంజా గంగరాజు, వీఆర్వోలు తెల్లం పోతురాజు, నాగేశ్వరరావు, శ్రీరామ్ మూర్తి, బాలరాజు, రామ్మూర్తి, నాగరాజు, మంగతాయారు, ఆషాబేగం,జెన్నిఫర్, ప్రియాంక, మున్ని, మంగ, షామిలీ, తదితరులు పాల్గొన్నారు