రామచంద్రాపురం
బదిలీపై వెళుతున్న తాహసిల్దార్ చిన్న వెంకటేశ్వరులకు శనివారం సాయంత్రం రామచంద్రాపురం మండల రెవెన్యూ కార్యాలయంలో ఘనంగా ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. మండల రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, మండల ప్రజలు, మీడియా ప్రతినిధులు తాహసిల్దార్ చిన్న వెంకటేశ్వరులకు ఘనంగా పూలమాలవేసి దుశ్శాలవలతో ఘనంగా సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ నాతో కలసి పనిచేసిన అధికారులు, సిబ్బంది, సహాయ సహకారాలు మరువలేనిదని భావోద్వేగంతో తెలియపరిచారు. మండలంలో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సహకరించిన ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి ,జడ్పిటిసి ఢిల్లీ రాని భాను కుమార్ రెడ్డి, ఎంపీటీసీలకు సర్పంచులకు, ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. మండలంలో రెవెన్యూ విషయాలపై చాలా అవగాహన ఉన్న మండలం గా తెలియజేశారు. మళ్లీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో డిప్యూటీ కలెక్టర్ గా మన మండల అనుసంధానంలో పనిచేసే అవకాశం రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ రాయలచెరువు విపత్తు పరిస్థితుల్లో, మండలంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంలో, పేదల ఇళ్ల స్థలాల విషయంలో, తాహసిల్దార్ కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు