తుని:రైల్లో సెల్ ఫోన్లు అపహరించిన ఇద్దరు దొంగలను తుని గవర్నమెంట్ రైల్వే పోలీసులు పట్టుకున్నారు.చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాల ప్రవృత్తి గా చేసుకున్న కాకినాడకు చెందిన వల్లి రాజేష్, పిఠాపురానికి చెందిన బొడుకుర్తి రాజేష్ ఎలమంచిలి పులి అన్నవరం సామర్లకోట రైల్వేస్టేషన్లో సంచరిస్తూ రైలులో నిద్రిస్తున్న ప్రయాణికుల సెల్ఫోన్లను అపహరించారు. ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి నుంచి లక్ష ఇరవై వేల రూపాయలు విలువచేసే ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ షేక్ అబ్దుల్ మారూఫ్ చెప్పారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న
హెడ్ కానిస్టేబుల్ పితాని శ్రీనివాస్, కానిస్టేబుల్ ఎస్ రామకోటి, సామర్లకోట ఆర్పీఎఫ్ ఏఎస్ఐ వరప్రసాద్, అనకాపల్లి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ముకుందలను సబ్ ఇన్స్పెక్టర్ అభినందించారు