ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు నమ్మవద్దు.
పి సప్లపల్లిలోటిడిపి ప్రచారం.
లేపాక్షి: ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని హిందూపురం టిడిపి కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, టిడిపి కన్వీనర్ జయప్ప పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని ఈ పి. సడ్లపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాలయ్యను గెలిపించాలని దత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ హామీల కరపత్రాన్ని ఇంటింటా పంచిపెట్టారు. ఈ సందర్భంగా కన్వీనర్ జయప్ప మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ప్రజా సంక్షేమం కోసం వాళ్ళు పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు ప్రజల ఇళ్ల వద్దకే వస్తాయని ఆయన తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సంక్షేమ పథకాలను అర్హులందరికీ అమలు చేయలేదన్నారు. అర్హులైన వారికి ఏదో ఒక కారణంతో సంక్షేమ పథకాలు అమలు కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన దాదాపు లక్ష మందికి పెన్షన్లను వివిధ కారణాలతో నిలిపివేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ తో పెన్షన్లు ఇవ్వడం ఆలస్యమైతే అందుకు చంద్రబాబు నాయుడు కారణమని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించడంలో ఎంతవరకు వాస్తవం ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల్లో ప్రజలు ఓటుతో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. వైకాపా నేతలు తెలుగుదేశం పార్టీపై పలు రకాలుగా విమర్శిస్తున్నారని అది మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు సిరి వరం క్రిష్టప్ప, రామాంజనమ్మ, ఆనంద్ కుమార్, తిమ్మగానిపల్లి వెంకటేష్ , కొండూరు సర్పంచ్ సిద్ధార్థ , ప్రభాకర్ రెడ్డి,మారుతి ప్రసాద్, నాగలింగారెడ్డి, చోళ సముద్రం వెంకటేశులు, ఎంపీటీసీ గంగాధర్ ,కోడిపల్లి నాగరాజు ,సదాశివరెడ్డి ,డైరీ శ్రీరామప్ప, పి సడ్లపల్లి అశ్వర్థ లతోపాటు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.