తుని :జగన్ కు తొండంగి గ్రామ వాలంటీర్ పక్కుర్తి భవాని ఝలక్ ఇచ్చింది, తుని టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్ధి యనమల దివ్య గెలుపు కోసం ఉద్యోగానికి రాజీనామా చేసింది.తొండంగి గ్రామంలో వైసీపీ నాయకులు పక్కుర్తి నాగ సత్యనారాయణ, గ్రామ వాలంటీర్ భవాని తెలుగుదేశం పార్టీలోకి జాయినింగ్ అయ్యారు.
వారితోపాటు కుటుంబ సభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి జాయినింగ్ అయ్యారు.
ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ బెండపూడి నాయుడు, జిల్లా మత్స్యకార కమిటీ కన్వీనర్ కొడా వెంకటరమణ, రాష్ట్ర రైతు కమిటీ కార్య నిర్వహక కార్యదర్శి పేకేటి హరికృష్ణ, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి మురాలశెట్టి సత్యనారాయణ, మండల తెలుగు యువత అధ్యక్షులు బంటుపల్లి అన్వేష్, మండల ఎస్సి సెల్ ప్రెసిడెంట్ పిల్లి బాబ్జి, మాజీ ఎంపీటీసీ పక్కుర్తి నూకరాజు, దూలం అప్పారావు, మాజీ ప్రెసిడెంట్ సూరాడ రాంబాబు, కటకం ఈశ్వరరావు, పరమేష్,జిల్లా తెలుగు యువత సెక్రటరీ దూలం మురళి, జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి పక్కుర్తి వంశీ, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.