Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంతొలి ఏకాదశి పూజ, ఉపవాసం, వ్రత నియమాలు

తొలి ఏకాదశి పూజ, ఉపవాసం, వ్రత నియమాలు

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి తేదీ 16 జూలై 2024 రాత్రి 8:33 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో ఈ ఏకాదశి తేదీ జూలై 17వ తేదీ రాత్రి 9:02 గంటలకు ముగుస్తుంది. కనుక తొలి ఏకాదశి ఉపవాసం జూలై 17, 2024 బుధవారం రోజున చేయాల్సి ఉంటుంది. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు మర్నాడు అంటే ద్వాదశి తిది సూర్యోదయం తర్వాత మాత్రమే ఏకాదశి వ్రతం విరమిస్తారు. ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతం విరమించాలి.హిందూ మతంలో దేవశయని ఏకాదశి తిధికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఏకాదశి తిథి ప్రతి నెల రెండుసార్లు వస్తుంది. ప్రతి ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రపంచాన్ని పోషించే శ్రీమహావిష్ణువును పూజిస్తారు. ఏకాదశి వ్రతం చేస్తారు. ఈ నేపధ్యంలో ఆషాడ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు క్షీర సాగరంలో యోగ నిద్రకు చేరుకుంటాడు. దీంతో ఈ రోజు నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈనాలుగు నెలల్లో ఎలాంటి శుభకార్యాలు చేయరు. దేవశయని ఏకాదశి నుంచి దేవతని ఏకాదశి వరకు శుభకార్యాలు చేయడం పై నిషేధం ఉంది. దేవశయని ఏకాదశిని హరిశయని, పద్మనాభ, యోగనిద్ర ఏకాదశి, తొలి ఏకాదశి అని కూడా అంటారు. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 17వ తేదీన వచ్చింది. ఏకాదశి పారణ సమయం ఉదయం. ఉపవాసం ఉన్నవారు ఉదయం సమయంలో పారణం చేయలేకపోతే.. ద్వాదశి తిథి రోజున ఉదయం స్నానం చేసి.. విష్ణువుని పూజించాలి. అనంతరం బ్రాహ్మణులకు అన్నదానం చేసి ఆ తర్వాతే ఉపవాసం విరమించాలీ.విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం. కనుక తులసి లేని విష్ణువు పూజ అంగీకారం కాదని విశ్వాసం. అందుకే విష్ణువు కోసం చేసే పూజ, ఉపవాసంలో తులసిని తప్పనిసరిగా ఉపయోగించాలి. ఏకాదశి వ్రతం విరమించాలంటే తులసి దవళంను నోట్లో వేసుకోవచ్చు.విష్ణువు ఉసిరి చెట్టుపై నివసిస్తాడని భావిస్తారు. అందుకే ఏకాదశి వ్రతంలో ఉసిరికాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఉసిరికాయను భుజించడం ద్వారా ఏకాదశి వ్రతం చేసినందుకు పిల్లలకు శుభం కలుగుతుంది. సంతానానికి అదృష్టం, ఆరోగ్యం, సంతోషం కలుగుతుంది.ఏకాదశి వ్రతం విరమణ సమయంలో తప్పనిసరిగా అన్నం తినాలి. ఏకాదశి ఉపవాసం రోజు అన్నం తినడం నిషిద్ధం..అయితే ద్వాదశి రోజు అన్నం తినడం ఉత్తమమైనదిగా భావిస్తారు. ఏకాదశి నాడు అన్నం తినడం వల్ల సరీసృపాల రూపంలో జన్మిస్తారని, ద్వాదశి నాడు అన్నం తిని ఉపవాస దీక్ష విరమించడం వల్ల ఈ రూపం నుంచి విముక్తి లభిస్తుందని మత విశ్వాసం.ఏకాదశి వ్రతం పాటించేటప్పుడు పొరపాటున కూడా ఆహారంలో కొన్ని వస్తువులను ఉపయోగించకూడదు. ముల్లంగి, బెండకాయ, ఆకుకూరలు, కాయధాన్యాలు, వెల్లుల్లి-ఉల్లిపాయలు మొదలైన వాటిని ఉపవాసం విరమించేటప్పుడు ఉపయోగించడం నిషేధించబడింది.
దేవశయని ఏకాదశి రోజు నుండి 4 నెలల పాటు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. మొత్తం నాలుగు నెలల పాటు యోగ నిద్రలోనే ఉంటాడని ఒక మత విశ్వాసం. ఈ సమయంలో విశ్వ నిర్వహణ శివుని చేతిలో ఉంటుంది. విష్ణువు నిద్రించే ఈ నాలుగు నెలలను చాతుర్మాసం అంటారు. ఈ నాలుగు మాసాలలో శ్రావణ, భాద్రపద, అశ్వినీ, కార్తీక మాసాలు ఉన్నాయి. చాతుర్మాసం ప్రారంభం నుండి వచ్చే నాలుగు నెలల వరకు వివాహం మొదలైన శుభకార్యాలన్నీ నిషిద్ధం. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం, విష్ణు, లక్ష్మిదేవిలను పూజించడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలు ఉంటాయని విశ్వాసం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article