Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలుది కేరళ స్టోరీ

ది కేరళ స్టోరీ

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి వివాదం చెలరేగింది. బలవంత మతమార్పిడికి గురై ఐసిస్ లో చేరిన మహిళ కథే ఈ సనిమా.సోదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా మే5న విడుదలైన విషయం విధితమే. ఒకవర్గాన్ని కించపర్చేలా ఈ సినిమా ఉందంటూ, సినిమాను నిషేధించాలంటూ కేరళ , తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు సైతం జరుగుతున్నాయి. అయితే, ఈ సినిమా విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.ది కేరళ స్టోరీ సినిమా రాజకీయంగానూ చర్చల్లో నిలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ సినిమా విడుదల కావడంతో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం ది కేరళ స్టోరీ సినిమాను బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మందుగుండు సామాగ్రి లేని కొత్త తరహా ఉగ్రవాదం పుట్టుకొచ్చిందని అన్నారు. ఈ చిత్రం విషపూరిత ఉగ్రవాదాన్ని బట్టబయలు చేస్తుందని చెప్పారు. ఈ రకమైన ఉగ్రవాదం ఏ రాష్ట్రానికి, మతానికి సంబంధించినది కాదన్నారు.కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ప్రచారంలోభాగంగా ఓ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ది కేరళ స్టోరీ సినిమా గురించి ప్రస్తావించారు. ఈ సినిమా ఉగ్రవాద కుట్ర నేపథ్యంలో రూపొందిందని చెప్పారు. ఈ చిత్రం తీవ్రవాదం యొక్క అసహ్యకరమైన సత్యాన్ని బయటకు తెలుస్తుందని, ఉగ్రవాదుల రూపకల్పనను బహిర్గతం చేస్తుందని చెప్పారు.ఈ సినిమాను కొన్ని రాష్ట్రాలు నిషేధిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సినిమాను నిలుపుదల చేస్తున్నారు. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఈ సినిమాపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. ది కేరళ స్టోరీ.. లవ్ జిహాద్, మత మార్పిడి, ఉగ్రవాదం యొక్క కుట్రను బహిర్గతం చేస్తుందని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article