వైట్ వాష్ చేయాలంటే భారీ ఖర్చులు
ఎన్నికల అధికారులు ఈ విషయంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి?
నల్లచెరువు :రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాలపై వేసిన వైకాపా రంగుల తొలగింపు ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు నాయకులు అత్యుత్యాహంతో ప్రభుత్వ కార్యాలయ పై వేయించిన రంగులు తొలగిస్తారా లేదా అనేది నల్లచెరువు మండల వ్యాప్తంగా చర్చ సాగుతోంది.ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీలు రంగులు తొలగించాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే మండల వ్యాప్తంగా రోడ్లపై,దుకాణాలపై, పలు కార్యాలయాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు బ్యానర్లు సంక్షేమ పథకాలకు సంబంధించిన బోర్డులు తొలగించారు.అయితే మండల కేంద్రంలో రైతు భరోసా కేంద్రాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రంగును ఇప్పటివరకు తొలగించలేదు.ఈ విషయమై మండల వ్యవసాయ అధికారి భారతీని వివరణ కోరగా కోడ్ అమల్లో ఉన్న మాట వాస్తవమేనని అందువల్లనే కార్యాలయాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన అన్నింటిని తొలగించామని తెలిపారు.అయితే రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి వేసిన రంగులను తొలగించాలని ఇప్పటివరకు ఉన్నతాధికారుల నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో తొలగించలేదని పేర్కొన్నారు. పై అధికారుల నుండి ఏవైనా ఆదేశాలు వస్తే ఎన్నికల కోడ్ను పాటిస్తామని తెలిపారు. మరి ఎన్నికల కమిషన్ దీనిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.