కామవరపుకోట
ఏలూరు జిల్లా ఎస్ బి వారి ఆదేశాల మేరకు ఏ డి డి ఎల్. ఎస్పి ఎస్ ఈ బి ఏలూరు సిబ్బంది ఆధ్వర్యంలో ఈ రోజు చింతలపూడి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో చింతలపూడి సెబ్ ఇన్స్పెక్టర్ మరియు ఏలూరు ఎస్ ఈ బీ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది తో కలసి చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం మరియు కామవరపుకోట మండలం, కామవరపుకోట గ్రామాలలో దాడులు జరిపి నాగిరెడ్డి గూడే0 గ్రామంలో మూడు కేసులు నమోదు చేసి 60 లీటర్ల నాటు సారా ను సీజ్ చేసి 2100 లీటర్ల బెల్లపు వూటను నేరస్థలం నందు ధ్వంసం చేయడం అయ్యింది.
మరియు కామవరపుకోట మండలం కామవరపుకోట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ని అరెస్టు చేసి అతని వద్ద నుండి 5 లీటర్ల నాటు సారా ని సీజ్ చేయడం అయినది.
ఈ దాడులో చింతలపూడి సెబ్ ఇన్స్పెక్టర్ డి ఎస్ ఎస్ వి ప్రసాద్ మరియు ఎస్ ఈ బి ఇన్స్పెక్టర్ పి .సునీల్ కుమార్ అధ్వర్యంలో సిబ్బంది పాల్గొన్నారు.