మతతత్వ బిజెపిని కట్టడి చేసిన దేశ ప్రజలు
సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర
కడప సిటీ :బుధవారంకడపసిపిఐకార్యాలయంలోవిలేకరులసమావేశంలో సిపిఐ జిల్లాకార్యదర్శిగాలిచంద్ర మాట్లాడుతూ టిడిపి ఇండియా కూటమితోకలిస్తేవిభజనహామీలుఅమలుకుఅవకాశంఉంటుందిఅన్నారు.జిల్లాలలోఅణచివేత, భూ ఆక్రమణలే మెజారిటీ స్థానాల్లో వైసీపీని ఓటమి పాలు చేశాయి.సమగ్రఅభివృద్ధికిప్రభుత్వంపై ఒత్తిడి నిరంతర ప్రక్రియ గాకొనసాగిస్తాం.రాష్ట్రంలోమాజీముఖ్యమంత్రివైయస్జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టిన నాటినుండి ల్యాండ్, సాండ్, మైన్, వైన్ మాఫియాను పెంచి పోషిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టి వ్యక్తిగత ఆస్తులు పెంచుకుంటూ, ప్రజలు,ప్రజా సమస్యలను పూర్తిగా పక్కకు నెట్టి ప్రశ్నించే అన్ని వర్గాలను అణచివేస్తూఅహంకారపూరితంగా పెత్తందారిమనస్తత్వంతో విర్రవీగిన జగన్సర్కార్నుచిత్తుగా ఓడించిప్రజలురాజకీయసమాధి కట్టారని, మతతత్వ బిజెపికి సీట్లు తగ్గించి దేశ ప్రజలు కట్టడి చేశారనిఆయనఅన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పరిష్కరించి, సమగ్ర అభివృద్ధికికృషిచేస్తారని 2019ఎన్నికలలోఅధికసంఖ్యలోఅసెంబ్లీపార్లమెంటుస్థానాలు కట్టబెడితే ఐదు సంవత్సరాల జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో దాటవేత వైఖరి అవలంబిస్తూ, అధికమొత్తంలోప్రజలపైపన్నులు వేసి, తిరిగి వారి అకౌంట్లో డబ్బులు వేయడానికిషరతులు పెట్టికుటుంబంలోఒకరికిఎగరగొట్టి ఇబ్బంది పెట్టడమే అభివృద్ధి అంటూ పేటీఎం బ్యాచ్ ద్వారా ప్రచారాన్నిఊదరగొడుతూఇసుక,మద్యంద్వారావచ్చేఆదాయాన్నిగండికొట్టివ్యక్తిగతఆదాయాన్ని పెంచుకుంటూ భూములు, గనులుఆక్రమించుకొనిఅమ్ముకొని సొమ్ము చేసుకుంటూ అడ్డు వచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయించి, ప్రశ్నించే వారిపై ఉక్కుపాదంమోపుతూసామాన్యులను దోపిడీచేసిసంపన్నుల ఊడిగం చేస్తూ, కేంద్రప్రభుత్వం నుండిరావలసినవిభజనహామీలు సాధించడంలో ఘోరంగా విఫలమై చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా జగన్ ప్రజా కోర్టులో దోషిగా నిలిచి చిత్తుగా ఓడిపోయారుఅన్నారు.అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న టిడిపి కేంద్రంలో బిజెపికి 240 స్థానాలకే పరిమితం కావడం, ఇండియా కూటమి స్థానాలు పెరగడం చంద్రబాబు నితీష్ కుమార్ లాంటి వారి అవసరం ఉన్న నేపథ్యంలో దేశం కోసం,రాష్ట్రభవిష్యత్తుకోసంఇండియా కూటమిలో కలవడం ద్వారా చట్టబద్ధంగా రావలసిన హక్కులనుఅడుగడుగునఉల్లంఘిస్తూ, రాష్ట్రానికివ్యతిరేకమైన చర్యలకుపూనుకోవడమేకాకుండాచంద్రబాబునుజైల్లోపెట్టించిన బిజెపికితగినబుద్ధిచెప్పినట్లు అవుతుందనిఅన్నారు.ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా,రాయలసీమఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తికినిధులు,రాజధానినిర్మాణం,కడపఉక్కుఫ్యాక్టరీనిర్మాణం తోపాటు దేశ సమైక్యత సమగ్రతకుదోహదపడుతుందన్నారు.జిల్లాలోవైసీపీఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని విలువైన ప్రభుత్వ వంక వాగు చెరువు రస్త అసైన్డ్ దేవాదాయ ఈనాంవక్ఫ్భూములనుఆక్రమించి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని అడ్డు వచ్చిన వెనకబడిన వర్గాలవారినిహత్య చేయడానికికూడావెనకాడలేదనివారుఆపోయారు.వీరిఅక్రమాలు దౌర్జన్యాలు సహించలేకనే జిల్లాలో మెజారిటీ లో వైసిపి ఎమ్మెల్యేలను చిత్తుగా ఓడించి తగినబుద్ధిచెప్పారన్నారు.ప్రస్తుతంఏర్పడబోయేనూతనప్రభుత్వం జిల్లాల ఉక్కు పరిశ్రమ, నీటిపారుదల ప్రాజెక్టులు, కడప బుగ్గవంకసుందరీకరణపనులు, కడప బెంగళూరు రైల్వే మార్గం, మూతపడ్డచెన్నూరుచక్కెరఫ్యాక్టరీ,ప్రొద్దుటూరుపాలకేంద్రం,కొప్పర్తిపారిశ్రామికకేంద్రంలోపరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన,విద్య,వైద్యం అందుబాటులోకితెచ్చి,దళితులు మహిళలు మైనారిటీలకు రక్షణకల్పించిసమగ్రఅభివృద్ధికి కృషి చేయాలని, వైసిపి భూ అక్రమ కేటాయింపులపై సమగ్ర విచారణ జరిపించి అర్హులైన పేదలకు పంచాలని అందుకు ప్రభుత్వంపై ఒత్తిడి నిరంతరం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి చంద్రశేఖర్, జి వేణుగోపాల్, కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు.