తుని ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య
కోటనందూరు:వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాకంటక పాలనను తూర్పారబడుతూ తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యనమల దివ్య ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు.ఎన్నికలు దగ్గర పడుతుండటంతో దూకుడు పెంచిన తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య గెలుపు కోసం శక్తియుక్తులతో ప్రచార భేరి మోగిస్తున్నారు.మరో వైపు కూటమి అభ్యర్థి దివ్య ఓటర్లను ఆకర్షించే విధంగా ఎన్నికల శంఖారావం పూరించారు.ఇప్పటికే మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ఓటర్లను నేరుగా కలుస్తున్న యనమల దివ్య మీ బిడ్డగా వచ్చా…మీకు తోడూనీడై ..మీ సమస్యల పరిష్కార బాధ్యత నాదంటూ ప్రజా మద్దతు కూడగట్టడంలో ముందడుగు వేశారూ యనమల దివ్య.ఇలా సాగుతున్న మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ఇవాళ సూపర్ సిక్స్ పధకాలతో సూరపురాజుపేటలో జనప్రభంనం మోగించింది.కోటనందూరు మండల టిడిపి అధ్యక్షుడు గాడి రాజబాబు అధ్యక్షతన గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సూరపురాజుపేటలో బాబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్య కు టిడిపి జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలుగుదేశం అభ్యర్థి దివ్య జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణ తో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గడపగడపకు వెళ్ళిన జననేత్రి దివ్య కు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. యనమల ఆడపడుచు నుదుటన మహిళలు విజయ తిలకం దిద్ది గెలుపు నీదే దివ్యమ్మా అంటూ నిండు మనసుతో ఆశీర్వదించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న దివ్య మరో రెండు నెలల్లో టిడిపి జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని అన్ని సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రైతులను నిండా ముంచేసిందని పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించలేదని ఆరోపించారు. వైకాపా నిర్వాకం వల్ల తాండవ షుగర్ మూతపడిందని, ఫలితంగా చెరుకు రైతులు నష్టపోయారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోతుకూరు వెంకటేష్, దంతులూరి చిరంజీవి రాజు, అంకం రెడ్డి నానబ్బాయి, అంకంరెడ్డి రమేష్, లెక్కల భాస్కర్, మాజీ సర్పంచ్ పోతల సూరిబాబు, గుడివాడ తాతబాబు, సబ్బవరపు అప్పలనాయుడు, మాజీ ఎంపీటీసీ సుర్ల సూరిబాబు, తమరాన సత్తిబాబు, గుడివాడ రాజు, సింగంపల్లి అచ్చయ్య నాయుడు, అన్నంరెడ్డి ఎర్రి నాయుడు, తమరాన అచ్చిరాజు, బంగారు కొండబాబు, అన్నంరెడ్డి తాతీలు,సుర్ల రమణ తదితరులు పాల్గొన్నారు