Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలునీ కట్టప్ప వేషాలు చాలించు మనోహర్ ..!

నీ కట్టప్ప వేషాలు చాలించు మనోహర్ ..!

జీఎస్డీపీలో, ఇండస్ట్రీయల్ గ్రోత్ రేట్ లోనూ మనమే ముందున్నాం..

  • అది చూసి ఓర్వలేకే పసలేని ఆరోపణలు
  • పరిశ్రమలకు భూములిస్తే అవినీతా..? ఇదెక్కడి చోద్యం..?
    -: మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ సూటి ప్రశ్నలు

మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

జీఎస్డీపీలో మనమే నెంబర్ వన్ః

  • ప్రతిపక్ష నాయకులు కొంతమంది రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్దిని చూసి, నాలుగున్నరేళ్లగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ నిర్ణయాలతో వస్తున్న పెట్టుబడులు చూసి ఓర్వలేక నిందలు వేస్తున్నారు.
  • 2019లో జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి.. జీఎస్డీపీ గ్రోత్ రేట్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 22వ స్థానంలో ఉంటే.. నేడు 2022-23నాటికి జీఎస్డీపీ గ్రోత్ రేట్ లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాము.
  • దేశ జీఎస్డీపీ గ్రోత్ రేట్ 8.5శాతం అయితే.. ఇప్పుడు రాష్ట్ర జీఎస్డీపీ గ్రోత్ రేట్ 11.43శాతం. అంటే దేశ యావరేజ్ గ్రోత్ రేట్ కన్నా 3శాతం ఎక్కువ. ఇందుకు కారణం పారిశ్రామికరంగంలో ముఖ్యమంత్రి జగన్ గారు తీసుకొచ్చిన విప్లవాత్మక నిర్ణయాలే. ఈ జీఎస్డీపీ గ్రోత్ రేట్ మేము చెబుతున్నది కాదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిందే.
  • 2019లో వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి తలసరి ఆదాయం లో రాష్ట్రం 17 వ స్థానంలో ఉంటే.. ఈరోజు జగన్ గారి హయాంలో తలసరి ఆదాయంలో దేశంలోనే 9వ స్థానంలో ఉన్నాం.
  • రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2019లో రూ.1,50,000 తలసరి ఆదాయం ఉంటే ఈ రోజు రూ. 2,10,000 తలసరి ఆదాయంతో 9వ స్థానంలో మనం ఉన్నాం.
  • అదేవిధంగా, పారిశ్రామిక అభివృద్ధి ద్వారా వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక గడిచిన నాలుగేళ్ళల్లో లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ సెక్టార్ లో 1,45,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఎంఎస్ఎంఈ రంగంలో అయితే దాదాపు 13లక్షల మందికి ఉపాధి కల్పించడం జరిగింది.
  • 2019లో వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే నాటికి వ్యవసాయ రంగం అభివృద్ధిలో రాష్ట్రం 27వ స్థానంలో ఉంటే.. ఈ రోజు దేశంలో 6వ స్థానంలో ఉన్నాం.
  • మన ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక నిర్ణయాలే దీనికి కారణం. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ వ్యవస్థ, 15వేల మంది అగ్రికల్చర్ అసిస్టెంట్లు, రైతు భరోసా కార్యక్రమం ద్వారా ప్రతి ఏడాది రూ.6 వేల కోట్లకు పైగా పెట్టుబడి సాయం, దాదాపు 53నుంచి 55 లక్షల మంది రైతులకు అందించడం కానీ, తదితర కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగానికి ఊతమివ్వడం జరుగుతోంది.

పారిశ్రామిక అభివృద్ధిలో 3వ స్థానంః

  • ఇండస్ట్రీయల్ గ్రోత్ రేట్ చూస్తే.. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి 22వ స్థానంలో రాష్ట్రం ఉంటే.. ఈ రోజు జగన్ గారి విధానాలతో దేశంలో 3వ స్థానంలో ఉంది.
  • గడిచిన ఈ 9 నెలల కాలంలో పెట్టుబడులు ఆకర్షించడంలో గుజరాత్ తర్వాత దేశంలోనే రెండో స్థానంలో మన రాష్ట్రం ఉంది.
  • జగన్ గారు పారిశ్రామికవేత్తలకు చేయూతనిస్తూ, చెయ్యి పట్టుకుని నడిపిస్తూ, ఊతమిస్తున్న ఇండస్ట్రీయల్ పాలసీ విధానాలే ఇందుకు కారణం.
  • ఆర్ బీఐ రిపోర్ట్స్ గానీ, కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అనేక ర్యాంకింగ్స్ గానీ చూస్తే ఈ ర్యాంకింగ్స్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్ గారి ఆలోచన విధానానికి నిదర్శనం.
  • బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ఫ్లాన్ (బిఆర్ఏపీ ).. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం గడిచిన మూడేళ్ళగా నెంబర్ వన్ స్థానంలో ఉంది.
  • ఏ స్థాయి పరిశ్రమ రాష్ట్రానికి వచ్చినా.. ఆ పరిశ్రమకు కావాల్సిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్.. రోడ్ల సదుపాయం, ఎలక్ట్రిక్ సదుపాయం, వాటర్ రిక్వైర్ మెంట్స్, తదితర ప్రాథమిక అవసరాలను వెంటనే కల్పిస్తున్నాం..
  • ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రభుత్వమే చేయి పట్టుకుని నడిపించాలి, వారికి కావాల్సిన సహాయసహకారాలు అందించాలని సీఎంగారు ఎప్పుడూ, ప్రతి సమీక్షలో చెబుతూనే ఉంటారు.
  • కొవిడ్ సమయంలో చాలా ఇబ్బందిపడిన ఎంఎస్ఎంఈ రంగానికి రీస్టార్ట్ ప్యాకేజీ కింద 2021-22లో దాదాపు రూ.950 కోట్లు ఇచ్చి చేయూతనివ్వడమే కాకుండా, ఇన్సెంటీవ్స్ రూపంలో మరో రూ.2వేల కోట్లు ఇచ్చి వారు కోలుకునే విధంగా ఆదుకోవడం జరిగింది.
  • గడిచిన టీడీపీ ప్రభుత్వంలో ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా నెగ్లెట్ చేసిన పరిశ్రమలకు కూడా .. మన ప్రభుత్వం వచ్చాక సహకారం చేయడం జరిగింది.
  • గత ప్రభుత్వంలో పెండింగ్ పెట్టిన రాయితీ బకాయిలను కూడా మేమే ఇవ్వడం జరిగింది.
  • గత టీడీపీ ప్రభుత్వంలో కన్నా.. వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ రంగంలో 650 శాతం గ్రోత్ రేట్ కనిపిస్తుంది.

రాష్ట్రంవైపు చూస్తున్న పారిశ్రామిక దిగ్గజాలుః

  • ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు పారిశ్రామిక రంగంలో చేస్తున్న విప్లవాత్మక మార్పులను, ఆయన ఇస్తున్న చేయూత, పట్టుదల, చిత్తశుద్ధిలను చూసి దేశంలోని, ప్రపంచంలోని అనేకమంది ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. రిలయన్స్, అదానీ, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఓబ్రాయ్, హీరో మోటర్స్, బిర్లాస్, జిందాల్ గ్రూప్, ఏటీసీ టైర్స్, యకోహమా టైర్స్, తదితర కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి.
  • ఏసీ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్ గా రాష్ట్రాన్ని తయారుచేశాం. మరో రెండు-మూడేళ్ళలో భారతదేశంలో తయారయ్యే ఏసీల్లో దాదాపు 50శాతం రాష్ట్రం నుంచే తయారుకాబోతున్నాయి.. డైకిన్, బ్లూస్టార్, హెవెల్స్, లాయిడ్ తదితర ప్రముఖ ఏసీ సంస్థలన్నీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
  • గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో కూడా పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించాము. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చారు.
  • ప్రతి కేబినెట్ మీటింగ్ లో పెట్టుబడులు క్లియరెన్స్ ఇవ్వడం జరుగుతోంది. తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్ లో కూడా రూ.20వేల కోట్ల పెట్టుబడులకు కూడా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది..

అతిపెద్ద సముద్ర తీరం.. సహజ వనరులకు కొదవలేదుః

  • దేశంలోనే రెండో అతిపెద్ద సముద్రతీరం కలిగిన రాష్ట్రం మనది. రాష్ట్రంలోని ఇతర సహజవనరులను ఉపయోగించుకుని రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలనే కార్యాచరణతో ఇప్పటికే ఉన్న 6 పోర్టులతో పాటు కొత్తగా 4 పోర్టుల నిర్మాణం జరుగుతున్నాయి.. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, అలాగే పీపీపీ పద్దతిలో కాకినాడ పోర్టు నిర్మాణం జరుగుతున్నాయి. రామాయపట్నం పోర్టును త్వరలోనే ప్రారంభం చేయబోతున్నాము. మూలపేట, మచిలీపట్నం పోర్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. కాకినాడ సీపోర్టు కూడా 12నెలల్లో పూర్తవుతుంది.
  • 10 ఫిషింగ్ హార్బర్ లు వాటిలో 2, 3 సీఎంగారి చేతుల మీదుగా ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది. ఫిష్ ల్యాండింగ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. మనకున్న 974కి.మీ. సముద్ర తీర పరిధిలో ప్రతి 50కిలోమీటర్లకు ఒక యాక్టివిటీ ఉండాలని, సముద్ర తీరం మీద ఆధారపడిన కమ్యూనిటీస్ జీవనోపాధి కోల్పోకుండా ఫిషింగ్ హార్బర్ లు నిర్మాణం చేస్తున్నాము.
  • ఎగ్జిస్టింగ్ పోర్టులతో పాటు కొత్తగా నిర్మించే పోర్టులకు ఆనుకుని ఉన్న అనేక భూములు సేకరించి ఇండస్ట్రీయల్ హబ్స్ క్రియేట్ చేయాలి, పోర్టు ఆధారిత పరిశ్రమలు తీసుకురావాలని పెద్దఎత్తున కార్యాచరణ రూపొందించడం జరిగింది
  • దేశంలో 11 ఇండస్ట్రీయల్ కారిడర్స్ ను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆయా రాష్ట్రాలు అభివృ ద్ది చేస్తుంటే.. అందులో మూడు ఇండస్ట్రీయల్ కారిడర్స్ కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరు, బెంగళూరు-హైదరాబాద్ కారిడార్స్ లో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ దగ్గర దాదాపు 45వేల ఎకరాల పారిశ్రామిక భూములున్నాయి. పారిశ్రామికవేత్తలను ఆకర్షించే కార్యక్రమం చేస్తున్నాం, ఆయా ప్రాంతాలను ఇండస్ట్రీయల్ హబ్స్ గా అభివృద్ది చేయబోతున్నాం.
  • అచ్యుతాపురంలో దాదాపు 5500 ఎకరాలు ఉన్న ఇండస్ట్రీయల్ పార్క్స్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ 2500 ఎకరాల్లో అభివృద్ది చేయబోతున్నాం
  • దేశంలోనే అతిపెద్ద పీసీపీఐఆర్ రీజియన్(పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్) కలిగిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 640 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన, భారతదేశంలోనే అతిపెద్ద పీసీపీఐఆర్ రీజియన్ గా కాకినాడ- విశాఖగా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
  • ప్రభుత్వం ఈ విధంగా అభివృద్ది కార్యక్రమాలు చేస్తుంటే, చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారు, ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు

నీ కట్టప్ప వేషాలు చాలించు మనోహర్ ..

  • జనసేన నాయకుడు నాదండ్ల మనోహర్ చిన్న కట్టప్పగా తయారయ్యాడు. ఆయన నిత్యం, ప్రభుత్వం మీద, జగన్ గారి మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. పరిశ్రమలకు భూములను ఉచితంగా ఇస్తున్నారని ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారు. ఆయన, పవన్ కల్యాణ్ ను ఎలాగూ తప్పుదోవ పట్టించాడు. ఇప్పుడు అవినీతి అంటూ ప్రజల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు.
  • నాదెండ్ల మనోహర్ కు చెబుతున్నాం.. నీ కట్టప్ప వేషాలకు పవన్ కల్యాణ్ పడతాడు కానీ, రాష్ట్ర ప్రజలు అమాయకులు కాదు… చంద్రబాబు స్క్రిప్ట్ చదివేస్తే, చంద్రబాబు కోసం కష్టపడి పనిచేస్తూ.. ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అంటే అది మీ అమాయకత్వం. నాదెండ్ల మనోహర్ కు.. సబ్జెక్టు లేదు, సరుకు లేదు. అతనికి ఉన్నదల్లా వెన్నుపోటు వారసత్వం తప్పితే మరేమీ లేదు. ఎన్టీఆర్ ఎపిసోడ్ లో పెద్ద వెన్నుపోటుదారుడు చంద్రబాబు అయితే, చిన్న వెన్నుపోటుదారుడు నాదెండ్ల మనోహర్.. వీళ్ళిద్దరూ ఇప్పుడు కలిశారు. అంటే, పెద్ద కట్టప్ప, చిన్న కట్టప్ప.. అన్నమాట. వీళ్ళ నాన్న, చంద్రబాబు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారు, రేపోమాపో నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్ ను పొడుస్తాడు , వీళ్ళందరు కలిసి వచ్చి ప్రజల్ని వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు.మీరు అనుకుంటున్నట్టు ప్రజలు అంత అమాయకులు కాదు.
  • ఇండస్ట్రీయల్ ల్యాండ్ అలాట్ మెంట్ పాలసీలో ఏదో జరిగిపోయిందని బురద జల్లే ప్రయత్నం చేశారు.. 2020లో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ ద్వారా ల్యాండ్ అలాట్ మెంట్ చేసిన తర్వాత, సేల్ అగ్రిమెంట్ చేయకపోతే వారికి బ్యాంకుల నుంచి లోన్స్ రావాడానికి ఇబ్బందులు పడుతున్నారని కొన్ని అసోసియేషన్స్ ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తే.. ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చి ల్యాండ్ అలాట్ మెంట్ చేసిన తర్వాత 3ఏళ్ళ కాలంలో డీపీఆర్ ప్రకారం ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేస్తే తర్వాత సేల్ డిడ్ చేస్తామని సవరణ చేయడం జరిగింది. దానిలో తప్పేముంది.? దానికే ఏదో జరిగిపోతునట్టు తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు.

పరిశ్రమలకు భూములిస్తే అవినీతంటారా..?

  • ఇవాళ ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తోంది.. నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ గ్రీన్ ఎనర్జీకి ఆంధ్రప్రదేశ్ దేశానికి దిక్సూచి కాబోతుందని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుంది. వాటికి బిడ్స్ కు కాల్ ఫర్ చేశారు.. అందులో ఇండోసోల్ సంస్థ ఎల్ 1 గా వచ్చింది. పీఎల్ఐ క్వాలిఫై అయ్యారు.. రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ముందుకువచ్చి ప్రపంచస్థాయి సంస్థల సహకారంతో, రాష్ట్రంలో రూ.45,000కోట్ల పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చారు.. పరిశ్రమ పెట్టడానికి వస్తే భూమి ఇవ్వడానికి సహకరించం, పరిశ్రమకు సహకరించం అని వదిలేయమంటారా?
  • రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ సోలర్ ప్లాంట్ లు పెట్టాలంటే దానికి సంబంధించిన రా మెటీరియల్ చైనా నుంచి తెచ్చుకుంటున్నారు. సోలర్ విప్లవం ప్రపంచవ్యాప్తంగా ఉంది అటువంటి సోలర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే కావాల్సిన ఎన్ టూ ఎన్ ప్రొడెక్ట్స్ అన్నీ కూడా, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ రాష్ట్రంలో పెడతామని ముందుకొస్తే వారికి భూమి ఇవ్వడం తప్పా?
  • మనకున్న పాలసీ ప్రకారం.. పెద్దఎత్తున్న పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చి ఎక్కువ మందికి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేసేవారికి సహజంగానే రాయితీలను ప్రభుత్వం ఇస్తుంది. ఇవిఅన్నీ కూడా ఓపెన్ డొమైన్ లో ఉన్నాయి. దాన్నీ స్కామ్ గా చూపి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
  • గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో రూ. 43వేల కోట్లతో ఎంవోయూ చేసుకున్నారు, గతంలో చేసుకున్నట్టుగా తప్పుడు ప్రచారం చేశారు.
  • కెపాసిటీ పెంచుకుంటాం.. అదనంగా మరో రూ.15వేల కోట్లు పెట్టుబడులు పెడతాం.. మొత్తంగా రూ.60వేల కోట్ల పెట్టుబడులు పెడతాం, అందుకు అనుగుణంగా అదనంగా ల్యాండ్ కావాలంటే ఇస్తామన్నాము.. ఫెసిలిటీ చేసి రైతులతో మాట్లాడి అక్కడున్న రేటు ప్రకారం, యాక్ట్ ప్రకారం వారికి భూములు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. వెనుకబడిన ప్రాంతంలో పోర్టు ఆధారిత పరిశ్రమ వస్తే, దాదాపు 30వేల ఉద్యోగాలు ఇస్తామంటే దాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు.
  • ఆ పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్త సీఎం సొంత జిల్లా అయినంత మాత్రాన పెట్టుబడులు పెట్టకూడదా? మీకు సంబంధించిన వ్యక్తులు, మీ వర్గానికి చెందిన వ్యక్తులు ఎక్కడ ఏం చేసినా పర్లేదు కానీ, ఇంకేవరైనా చేస్తే తప్పు అంటే ఎలా…?
  • నీ బ్యాక్ గ్రౌండ్ లీడర్ చంద్రబాబు. అతను, నువ్వు కలిసి ఏదైనా రాజకీయం చేయవచ్చు, మీరు అధికారంలో ఉన్నప్పుడు కావాల్సిన వ్యక్తులకు ఏదైన చేయవచ్చు, వారు పెట్టుబడులు పెట్టకపోయినా భూములు అప్పనంగా ఇచ్చేశారు..
  • గ్రీన్ ఎనర్జీ సెక్టార్ లో పెట్టుబడులు పెట్టి, మన రాష్ట్రం దేశానికే దిక్సూచిగా ఉండబోతుందని ఆలోచన చేసి ముందుకొస్తే విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు విషయాలు, ప్రభుత్వాన్ని నిందించి, బురదజల్లే కార్యక్రమమే తప్ప ఆ ఆరోపణల్లో పస లేదు.
  • పారిశ్రామిక రంగంలో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందంటే మనం తీసుకున్న విధానాలు, మన ప్రభుత్వం ఇస్తున్న సహకారమే ఇందుకు కారణం.
  • నీ కట్టప్ప రాజకీయాలు పవన్ కల్యాణ్, చంద్రబాబు దగ్గర చూపించు.. అంతే తప్ప ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేయవద్దు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article