ప్రజాభూమిప్రతినిధి,కడపః
వల్లూరు మండల పరిధిలోని పుష్పగిరి మహాక్షేత్రంలో జిల్లా వారసత్వ సంపద యొక్క వైభవాన్ని, ఘన చరిత్రను తెలియజేస్తుందని భారత జాతీయ కళా వారసత్వ పరిరక్షణ సంస్థ జీవితకాల సభ్యుడు, పుష్పగిరి క్షేత్ర ధర్మపరిరక్షణ సేన జిల్లా సభ్యులు సట్టి భారవి తెలిపారు. మే 5న వ్యాస పౌర్ణమి, బుద్ధ పౌర్ణమి సందర్భంగా గిరిప్రదిక్షిణ ఘనంగా నిర్వహిస్తామన్నారు. భక్తులు, యాత్రికులు, స్థానిక ప్రజలు, నగర వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.