ప్రజాభూమి, రామచంద్రపురం
శ్రీవెంకటేశ్వర పశువైద్యవిశ్వవిద్యాలయ పాలకవర్గ సభ్యురాలుగా రామచంద్రపురం మండలం ఉండూరు గ్రామానికి చెందిన దంగేటి సత్యకుమారి నియమితులయ్యారు.దీంతో ఆమే పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈమేరకు సత్యకుమారి వెలగపూడి సచివాలయంలోమంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఉండూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు దంగేటి చినబాబు సతీమణి అయిన సత్యకుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ పాలకవర్గ సభ్యురాలిగా నియమితులై పదవి ప్రమాణస్వీకారం చేసారు.ఈకార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పల్లాజగపతి రామయ్య ,పాలకవర్గ సభ్యులుతదితరులు పాల్గొన్నారు కాగా సత్యకుమారి ప్రమాణస్వీకారం చేసి బాద్యతలు చేపట్టిన సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,, రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వాసంశెట్టి శ్యామ్, అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ పండు గోవిందరాజు, రామచంద్రపురం జడ్పిటిసి మెర్నెడి వెంకటేశ్వరరావు, డాక్టర్ .కొప్పి శెట్టి సత్తిబాబు తదితరులు ఈసందర్భంగా అభినంధనలు తెలియజేసారు.