Thursday, November 28, 2024

Creating liberating content

హెల్త్పిల్లలు చురుకుగా పెరగాలంటే..?

పిల్లలు చురుకుగా పెరగాలంటే..?

పిల్లల బుర్ర చాలా చురుకుగా ఉండాలని పిల్లలతో ఏవేవో కసరత్తులు చేయిస్తుంటారు తల్లిదండ్రులు. కానీ కొన్ని రకాల ఫుడ్స్ ని పిల్లలకు తనిపించడం వల్ల.. వారి బ్రెయిన్ చాలా చురుకుగా పని చేస్తుందని మీకు తెలుసా? మరి ఆ ఫుడ్స్ ఏంటో చూద్దాం..
పిల్లలు ఇష్టపడే పదార్ధాలు చాక్లెట్స్. ఇవి ఇష్టపడని పిల్లలు ఎవరూ ఉండరు. అయితే.. వారు తినే నార్మల్ చాక్లెట్ కి బదులు..డార్క్ చాక్లెట్ ఇవ్వడం మంచిది. చిన్న డార్క్ చాక్లెట్ ముక్క తినడం వల్ల.. పిల్లల బ్రెయిన్ చాలా చురుకుగా పని చేస్తుంది. పిల్లలకు ఇది తినడం అలవాటు అయితే వదిలిపెట్టరు.
పిల్లలకు పక్కాగా పెట్టాలి అని పేరెట్స్ అనుకునే వాటిలో.. నట్స్ కంపల్సరిగా ఉంటాయి. నట్స్ తినడం వల్ల.. కూడా బ్రెయిన్ చాలా చురుకుగా పని చేస్తుంది. పిల్లలు నట్స్ తినకపోతే.. పౌడర్ లా చేసి అయినా.. వేరే ఫుడ్స్ లో కలిపి తినిపించవచ్చు.
గుడ్డులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి6, విటమిన్ బి12 కూడా ఉంటాయి.ప్రతిరోజూ పిల్లలకు ఒక కోడిగుడ్డు అందించాలి. గుడ్డు తినడం వల్ల కూడా.. పిల్లల బ్రెయిన్ చురుకుగా పని చేస్తుంది.
బ్రోకలీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా లభిస్తున్న కూరగాయ. దీనిని చాల రకాలుగా తీసుకోవచ్చు. సలాడ్ రూపంలో అయినా పిల్లలకు అందించవచ్చు. దీనిలోనూ యాంటీ ఆక్సీడెంట్స్ తోపాటు.. విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. మెదడు చురుకుగా పని చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మెదడు పెరుగులకు, చురుకుగా పని చేయడానికి చేపలు సహాయపడతాయి. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా సాల్మన్ లాంటి ఫ్యాటీ ఫిష్ లను పిల్లల ఆహారంలో భాగం చేయాలి. ఇలా చేయడం వల్ల.. అవి మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article