జిల్లా ఖాజానా అధికారి
ప్రజాభూమి,తిరుపతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వ్యులు జి.ఒ.ఎమ్ఎస్.నెంబర్.7 ఫైనాన్స్ బడ్జెట్ 11.డిపార్ట్మెంట్ తేదీ 11.01.2023 ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు పెన్షనర్ విధిగా తమ తమ సిఎఫ్ఎమ్ఎస్. ఐడి లను వారి యొక్క ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్లకు అనుసంధానము చేయవలసి యున్నది. సిఎఫ్ఎమ్ఎస్ ఐడి, హెర్బ పే రోల్ కు సంబంధించిన సేవలను పొందాలంటే ఈ అనుసంధానము అత్యవసరము. తదనుగుణంగా ఉద్యోగుల యొక్క సిఎఫ్ఎమ్ఎస్ ఐడి లను ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్లకు అనుసంధానము చేయుట జరిగింది. కానీ పెన్షనర్ల సిఎఫ్ఎమ్ఎస్ ఐడి ల అనుసంధానము ఇంకా పూర్తి చేయవలసి యున్నదనీ,ఈ ప్రక్రియ మొత్తము ఈ మే నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలనిజిల్లా ఖజానా మరియు లెక్కల శాఖ అధికారి లక్ష్మీ కర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.కావున పెన్షనర్ల సౌలభ్యం కొరకు వారి ఈకెవైసి పూర్తి చేయుటకు గాను సంబంధిత ఉప ఖజానా కార్యాలయ సిబ్బంది తిరుపతి మరియు ఇతర ఉప-ఖజానా అధికారులు ఉప-ఖజానా కార్యాలయ పరిధిలో అందుబాటులో వుంటారనీ,తద్వారా ఆయా ఉప ఖజానా పరిధిలోని పెన్షనర్లు ఉప ఖజానా కార్యాలయ సిబ్బందిని సంప్రదించి ఈ కేవైసి పూర్తి చేయించుకోవలసినదిగా కోరడమైనది.పెన్షనర్లు వారి వెంట ఆధార్ కార్డు మరియు ఆధార్ అనుసంధానిత చరవాణి తెచ్చుకోవలసినదిగా వారు ఆ ప్రకటనలో తెలిపారు.