పులివెందుల :పేరుకు మాత్రం సీఎం ఇలాఖా ఆ సీఎం ఇలాఖాలో ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు సరైన బెడ్లు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ప్రధాన ఆసుపత్రిలో మౌలిక వసతులు లేక సరైన చాలినంత బెడ్స్ లేక కొట్టుకుంటున్న సామాన్యుడి గోడు ఏ అధికారికి, నాయకులకు పట్టదా అని రోగులు అంటున్నారు ఆసుపత్రికి వచ్చిన రోగులు మంచాల మీద కూర్చోరాదట? ఎందుకంటే విరిగి పోయిన మంచాలు మరింత విరిగిపోయే అవకాశం ఉందని, రోగులు కూర్చోబట్టే మంచాలు విరిగిపో యాయని ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే ఉద్యో గులు చెబుతున్నారు ఆరోగ్యం బాగాలేక చిన్నపిల్ల లను ఆసుపత్రికి తీసుకువస్తే ఆస్పత్రిలోని బెడ్లలో పిల్లలను పడుకోబెట్టి పెద్దలు క్రింద కూర్చోవాలి ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చుపెట్టి నూతన ఆస్పత్రి నిర్మాణాలు చేపట్టింది అయితే మంచాలకు నిధు లు మంజూరు చేయలేదని రోగులు వెటకారంగా చర్చించుకుంటున్నారు ఆసుపత్రి అధికారులకు రోగులు పడే ఇబ్బందులు తెలియలేదా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలోని పాత మంచాలను తీసివేసి కొత్త మంచాలను ఏర్పాటు చేయాలని పలువురు రోగులు కోరుతున్నారు.