ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి
ప్రజాభూమి, పోరుమామిళ్ల
పోరుమామిళ్ళ ఆర్ టి సి బస్టాండ్ అభివృద్ధికి కృషి చెస్తానాని ఆర్ టి సి చెర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున్ రెడ్డి, ఆర్టీసీ డిఎం బద్వేల్ డిపో మేనేజర్ పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ ను పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి అభ్యర్థన మేరకు పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి కృషి చ్చేస్తానని మల్లికార్జున్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీకి లాభదాయకంగా ప్రజలకు అనుకూలంగా అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్ కాంపౌండ్, బస్టాండు అభివృద్ధి తోపాటు ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి మాట్లాడుతూ పోరుమామిళ్ల ఆర్టీసీ బస్టాండ్ కాంపౌండ్ కి మరియు అభివృద్ధికి సహకరించాలని చైర్మన్ మల్లికార్జున్ రెడ్డిని కోరగా ఆయన వెంటనే మంగళవారం పోరుమామిళ్ళకు విచ్చేసి స్వయంగా పరిశీలించి సహకరిస్తారన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బద్వేల్ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి, జడ్పిటిసి ముత్యాల ప్రసాద్, వైసిపిలు సి. భాష, చెన్ను రాజశేఖర్ పోరుమామిళ్ల వైఎస్ సర్పంచ్ రాళ్లపల్లి రవికుమార్, చపాటి నారాయణరెడ్డి రాళ్లపల్లి నరసింహులు, వైఎస్ఆర్సిపి నాయకులు చాపాటి సాయి నారాయణరెడ్డి, ప్రజలు పాల్గొన్నారు.