పోరుమామిళ్ల:తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు రోజురోజుకు ఆదరించడం ఎక్కువైతుందని ఆ నమ్మకంతోనే బద్వేల్ నియోజకవర్గం లోని కాంగ్రెస్ అభ్యర్థి విజయ జ్యోతి గెలుపు ఖాయం అని రాష్ట్ర పిసిసి చైర్మెన్ తులసి రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా స్థానిక పోరుమామిళ్ల పట్టణంలోని అన్వర్ హాస్పిటల్ ఆవరణంలో విలేకరుల సమావేశంలో తులసి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందుబాటు ఉండే 9 పథకాలు తీసుకురావడం జరుగుతుందని ఆయన అన్నారు. ఒకటి రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని, మూడవది మహిళలకు వంట గ్యాస్ ధర 500 వరకు సిలిండర్ రేటు, నాలుగు ఐదు లక్షల రూపాయలతో ఇళ్లు అందిస్తామని, ఆరు యువతి యువకులకు లక్షల 50 వేలు ఉద్యోగాలు, ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరికి నాలుగు వేల రూపాయలు పింఛన్ అందిస్తామని , వికలాంగులకు ఇంటివద్దే పింఛన్ పంపిణీ చేస్తామని, కుటుంబానికి ఆసరాగా ప్రతి మహిళకు 8500 పెద్ద కొడుకుగా అందిస్తామన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఐదు పథకాలతో అధికారంలోకి రావడం జరిగిందనీ ఆరు పథకాలతో తెలంగాణలో రావడం జరిగిందనీ ఆంధ్రప్రదేశ్లో 9 పథకాలతో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. అభ్యర్థి విజయ జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్రంలో, కాంగ్రెస్ పార్టీ అవసరం చాలా ఉందని, బద్వేల్ నియోజకవర్గంలో తనకు, కడప ఎంపీ అభ్యర్థి షర్మిలకి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షులు అన్వర్, సీపీఐ నాయకులు, పిడుగు మస్తాన్, రవికుమార్, కేశవ వీరయ్య సిపిఎం నాయకులు భైరవ ,కాంగ్రెస్ నాయకులు శామీర్ శ్రీను,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.