Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుప్రజల రక్తం త్రాగే జలగ జగన్

ప్రజల రక్తం త్రాగే జలగ జగన్

బటన్ నొక్కుడులో జగన్ ప్రజలకు ఇచ్చిందెంత? తాను బొక్కిందెంత?

మోసం చేయటం జగన్ కి పుట్టుకతో వచ్చిన నైజం

జగన్ ఆస్తులు నాడు ఎంత? నేడు ఎంత?

ఐదేళ్లలో రాయలసీమకు జగన్ చేసిందేంటి?

రాయలసీమలో ప్రాజెక్టుల కోసం నేను రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్తే…జగన్ ఖర్చు చేసింది రూ. 2500 కోట్లే

బీసీల్లోని 140 కులాలకు న్యాయం చేస్తాం

ఎన్డీయేతో పొత్తు ఉన్నా…ముస్లింలకు అన్యాయం జరగనివ్వను

రాష్ట్ర భవిష్యత్ కోసం, మీ పిల్లల భవిష్యత్ కోసం ఎన్డీయే కూటమిని గెలిపించండి

రాయదుర్గం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

రాయదుర్గం: ఐదేళ్ల సైకో పాలనలో మీరు ఏం నష్టపోయారో చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. వైసీపీ పాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి ఆ పార్టీ మసైపోవటం ఖాయం. వైసీపీ పాలనలో మీ పొలాలకు నీళ్లోచ్చాయా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా? నీళ్లు ఉంటే వ్యవసాయం అభివృద్ది చెందుతుంది, పరిశ్రమలు వస్తాయి. టీడీపీ హయాంలో ఇచ్చిన నీళ్లు తప్ప ఇప్పుడు చుక్క నీళ్లిచ్చారా? ప్రపంచాన్ని శాసించే శక్తి తెలుగు జాతికి ఉంది. మన పిల్లల్ని బాగా చదివిస్తే ప్రయోజకులవుతారు. స్కూళ్లకు రంగులు పూస్తే పిల్లలకు చదువులు రావు. టీచర్లను నియమించి స్కూళ్లలో కనీస సదుపాయాలు కల్పించాలి. నేడు 3 కి.మీ దూరంలో ఉన్న పాఠశాలలకు వెళ్లలేక బాలికలు చదువు మానేస్తున్నారు. 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదు. ఒక్క చాన్స్ అన్న జగన్ కి అదే చివరి చాన్స్. నాడు ముద్దులు పెట్టి నేడు పిడి గుద్దులు గుద్దుతున్నాడు.
రాయలసీమకు జగన్ చేసిందేంటి?
గత ఎన్నికల్లో 52 సీట్లకు గానూ 49 సీట్లలో వైసీపీని గెలిపించారు. కానీ మీకు జగన్ ఏం చేశాడు? 5 ఏళ్లలో మీ జీవితాల్లో మార్పులేమైనా వచ్చాయా? ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? టీడీపీ హయాంలో ఏం అభివృద్ది చేశామో నేను చెప్తా…జగన్ ఏం చేశాడో చెప్పగలడా సవాల్ విసురుతున్నా? రాయలసీమలో ప్రాజెక్టుల కోసం నేను రూ. 12 వేల కోట్లు ఖర్చు చేస్త్తే జగన్ ఖర్చు చేసింది కేవలం రూ. 2500 కోట్లు మాత్రమే. రాయలసీమకు కృష్ణా జలాలు తీసుకు రావాలని ఎన్టీఆర్ హంద్రీనీవా ప్రారంభించారు. నేను హంద్రీ నీవా కోసం 5 ఏళ్లలో రూ. 4500 కోట్లు ఖర్చు చేశా. తుంగభద్ర నుంచి నీళ్లు రాకుండా హెచ్.ఎన్సీ బూడిపోతే కర్ణాటక సీఎంతో మాట్లాడి దాన్ని ఆధునీకరణ చేశాం. నేడు దాన్ని అటకెక్కించారు. జీడిపల్లి, గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేశాం. అనంతపురం కియాకు తెచ్చాం. నేడు 12 లక్షల కార్లు ఏపీ నుంచి ఉత్పత్తి అయ్యాయి. ఇది మనకు గర్వకారణం. మిమ్మల్ని చూస్తే ఏం గుర్తొస్తుందని జగన్ అంటున్నారు. నన్ను చూస్తే అడుగడుగునా నేను చేసిన అభివృద్ది కన్పిస్తుంది. జగన్ ని చూస్తే గుర్తొచ్చేది విధ్వంసం. బైరవాని తిప్ప ప్రాజెక్టు పూర్తి చేశాం. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఏడాదిలో నీళ్లు వచ్చేవి. రేపు ఓట్ల కోసం వైసీపీ దొంగలు వస్తారు? ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో చొక్కా పట్టుకుని నిలదీయండి. మళ్లీ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే వైసీపీ పోవాలి, ఎన్డీయే ప్రభుత్వం రావాలి.
జగన్ ప్రజలకు ఇచ్చిందెంత తాను దోచింది ఎంత?
మీ నుంచి దోచుకున్న డబ్బులను రూ.లక్షకు ఒక లీటర్ రక్తం దోచుకున్నట్లు లెక్కకడదాం. మీకు ఇచ్చిన డబ్బులను రూ.లక్షకు ఒక పువ్వుతో లెక్కకడదాం. టీడీపీ ప్రభుత్వంలో రూ.60 ఉన్న మద్యం ధరను రూ.200 లకు పెంచి నాసిరకం మద్యం సరఫరా చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. మందుబాబుల నుంచి రోజుకు రూ.140 చొప్పున ఐదేళ్లలో రూ.2.50 లక్షలు దోచుకుంటున్నాడు జగన్ రెడ్డి. రెండున్నర లీటర్ల రక్తాన్ని జలగన్న తాగేస్తున్నాడు. మీ ఇంటి కరెంట్ బిల్లులు గతంలో రూ.200 వస్తే ప్రస్తుతం రూ.600-1000 వస్తున్నాయి. సరాసరి రూ.500 తీసుకున్నప్పటికీ.. ఐదేళ్లలో వాడకంని బట్టి రూ.30 వేల నుంచి లక్ష వరకు దోచుకుంటున్నాడు.. ఇందులో అరలీటర్ రక్తాన్ని జలగన్న పీలుస్తున్నాడు. రూ.70 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలను రూ.110కి పెంచి లీటర్కుధ రూ.40 దోచుకుంటూ.. ఐదేళ్లలో రూ.1.30 వేలు దోచుకుంటూ 1.3 లీటర్ల రక్తాన్ని జలగన్న తా గేస్తున్నాడు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇసుక, సిమెంట్, స్టీల్ ధరల్లో లీటర్లకు లీటర్ల రక్తాన్ని జలగన్న పీల్చేస్తున్నాడు. చెత్తపన్ను, వృత్తి పన్ను, రిజిస్టేషన్ ఛార్జీలతో భారీగా ప్రజలను దోచుకుంటున్నాడు. రూ. 13 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఒక్కో కుటుంబం మీద రూ.10 లక్షల అప్పు చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి రూ.7 నుంచి రూ.10 లక్షల భారం మోపాడు. టీడీపీ హయాంలో రూ.2 వేలు పింఛన్ పెంచితే.. ఈ ప్రభుత్వం రూ.వెయ్యి మాత్రమే పెంచింది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.4 వేలకు పెంచి మీ ఇంటిదగ్గరకే ఇస్తాం.
మోసం చేయటం జగన్ కి పుట్టుకతో వచ్చిన నైజం
మోసం చేయటం జగన్ కి పుట్టుకతో వచ్చిన నైజం. కాలువ శ్రీనివాసులును అనేక ఇబ్బందులు పెట్టారు. రాష్ట్రంలో ఎవరికైనా స్వేచ్చ ఉందా? పవన్ ని , నన్ను బూతులు తిడుతున్నారు. జగన్ ని భరించలేక వైయస్ బెంగుళూరుకి తరిమేశాడు. తల్లికి, తండ్రికి భారమైనోడు ఈ రాష్ట్రానికి భారం కాదా? 5 ఏళ్లలో రాష్ట్రం సర్వనాశనమైంది. అమరావతిని విధ్వంసం చేశారు, నేను కియాను తెచ్చా..పట్టిసీమతో నీళ్లు ఇస్తే అది అభివృద్ది. పోలవరాన్ని గోదావరిలో కలిపేస్తే అధి విధ్వసం. కమీషన్ల కోసం పరిశ్రమల్ని తరిమేశారు. ఎంపీ రఘురామరాజుని అక్రమ కేసులతో హింసించారు. పోలీసులు అతన్ని కొడుతున్న వీడియోలు ఆనందించిన సైకో జగన్. వివేకా హత్యపై మాట్లాడ్డొద్దంటూ కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు.
రాష్ట్రం కోసమే మూడు పార్టీల పొత్తు
రాష్ట్రం కోసమే మూడు పార్టీల పొత్తు. రూ. 13 లక్షల కోట్ల అప్పు ఉంది, రాష్ట్రం అభివృద్ది చెందాలంటే కేంద్రం సహకారం అవసరం. 1995 నుంచి 2004 వరకు ఎన్డీయేతో పొత్తులో ఉన్నాం. ఏనాడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా? బీజేపీ పెట్టిన ప్రతి బిల్లుకు సపోర్ట్ చేసిన జగన్ ఇప్పుడు మాపైన నిందలేస్తున్నాడు. 5 ఏళ్లలో జగన్ ముస్లింలకు ఒక్క రూపాయి ఖర్చు చేశారా? ఇమామ్, మౌజమ్ మేం వేతనాలిస్తే…అవి సక్రమంగా ఇవ్వకుండా నిలిపేశారు. ఎన్నికల ముందు విడుదల చేశారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఎలా ఆత్మహత్యకు పాల్పడిందో మనమందరం చూశాం. ఎస్సీ, ఎస్టీ,బీసీ మైనార్టీలపై దాడులు, దౌర్జన్యులు పెరిగిపోయాయి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీ పిల్లల భవిష్యత్ కోసమే ఈ పొత్తు ఆశీర్వదించండి. మేం గెలిస్తే బీజేపీకే సపోర్ట్ చేస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. టీడీపీ డైరెక్ట్ గా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. మేం గెలిస్తే నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తాం. జగన్ గెలిస్తే స్వార్దం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతాడు. భూ రక్షణ చట్టంతో ప్రజల భూములు కొట్టేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అది అమలైతే మీ భూమి మీ పేరు మీద ఉండదు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
సూపర్ సిక్స్
సూపర్ సిక్స్ తో పాటు ప్రధాని మోదీ ప్రకటించిన సంకల్ప్ పత్రం ప్రజలకు ఉపయోగపడేలా విజన్ తయారు చేసుకుంటాం. జగన్ మీకు ఇచ్చేది రూ. 10 దోచేది రూ. 100, దొబ్బేసేది రూ. 1000. సహజవనరులన్నీ దోచుకుంటున్నారు. దేశంలోకెల్లా రిచెస్ట్ సీఎం జగనే. 2004లో జగన్ ఆస్ది ఎంత నేడు ఎంత? రూ. 43 వేల కోట్లు దోచుకున్నాడని సీబీఐ చార్జ్ సీట్ వేసింది. ఈ 5 ఏళ్లలో రూ. 5 లక్షల కోట్లు దోచుకున్నాడు. సంపద సృష్టించి ఆదాయం ప్రజలకు పంచుతాం. రాష్ట్రాన్ని అభివృద్ది చేసే బాధ్యత కూటమిదే. మహాశక్తి కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 1500 చొప్పున ఏడాదికి రూ. 18 వేలు నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తాం. తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలున్నా..ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేలిస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తాం. అన్నధాత కింద రైతుకు ఏడాదికి రూ. 20 వేలిస్తాం. యువగళం కింద యువతకు నెలకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అధికారంలోకి రాగానే మొదటి సంతకం డీఎస్సీపైనే పెడతా. నేను ఎన్టీఆర్ 11 సార్లు డీఎస్సీ నిర్వహించి లక్షలాదిమందిని టీచర్లుగా నియమించాం. జగన్ ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. 25 వేల పోలీసులు ఉద్యోగాలు భర్తీ చేస్తాన్నన్నాడు చేశాడా? నేను రాగానే భర్తీ చేస్తా. గ్రూప్, 1 లో అక్రమాలకు పాల్పడ్డారు. కమీషన్ల కోసం పరిశ్రమలు తరిమేశారు. మన పిల్లల భవిష్యత్తు కోసం పరిశ్రమలు తెస్తా. వర్క్ ప్రమ్ హోం విధానం తెస్తాం. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. రైతులకు గిట్టు భాటు ధర కల్పిస్తాం. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. 90 శాతం సబ్సిడితో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం. అనంతపురం జిల్లాలో 10 లక్షల పంట కుంటలు తవ్వించాం. వాలంటీర్లు రాజీనామా చేయెద్దు, వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమే నెలకు రూ. 10 వేలు వేతనం ఇస్తాం.
బీసీల్లోని 140 కులాలకు న్యాయం చేస్తాం
50 ఏళ్లకే బీసీలకు వ్యధ్యాప్య ఫించన్ ఇస్తాం, 5 ఏళ్లలో బీసీలకు లక్షా యాబై వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఆధరణ పనిముట్లు, సబ్సిడీ రుణాలిస్తాం. బీసీల్లోని 140 కులాలకు న్యాయం చేస్తాం. టీడీపీకి వెన్నెముక బీసీలు. అందుకే ఎంపీ అభ్యర్దిగాగా బోయ సామాజిర్గానికి చెందిన అంబికా లక్ష్మీ నారాయణ, పక్కన హిందూపురం ఎంపీగా కురుబ సామాజిక వర్గానికి చెందిన పార్దసారధిని నిలబెట్టాం. రాయలసీమలో ఎంతమంది బీసీలకు టికెట్లు ఇచ్చారో జగన్ చెప్పాలి. మేం ముస్లింలకు మదనపల్లె, నంద్యాల ఎమ్మెల్యే సీట్లిచ్చాం. అన్ని వర్గాలకు న్యాయం చేశాం.
టీడీపీ అధికారంలోకి రాగానే
గుంతకల్ రిజర్వాయర్ నిర్మిస్తానని జగన్ మోసం చేశాడు, దాన్ని మేం నిర్మిస్తాం. గుమ్మగడ్డ మండలం గోనబాయిలో బీసీ బాలికల పాఠశాలకు రూ. 24 కోట్లు ఇస్తే వాటిని మద్యలో నిలిపేశారు. దాన్ని పూర్తి చేస్తాం. రాయదుర్గంలో బాలికల కళాశాలకు రూ. 52 లక్షలిస్తే దాన్ని మద్యలో నిలిపేశారు.జూనియర్ కాలేజీ నిర్మాణానికి ఆర్డీటీ ముందుకొచ్చినా ప్రభుత్వం చొరపచూపలేదు. మాన్యం బ్రాంచ్ కెనాల్ కి రూ. 266 కోట్లతో 36 వ ప్యాకేజీ తెస్తే దాన్ని నిలిపేశారు. అది వస్తే 27 వేల ఎకరాలకు సాగు నీరందేది. కనేకల్ లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తాం. బిందు తుంపర్ల సేద్యం కోసం 10 వేల ఎకరాలకు ప్రాజెక్టు ఇస్తే రూ. 183 కోట్లు నిలిపేశారు. వేదావతి, నగరి నదుల్లో 4 చోట్ల సబ్ సర్పేజ్ డ్యామ్ లు నిలిపేశారు. చిక్కణ్ణేశ్వరి స్వామి కనేకల్ చెరువుకి నీళ్లు రాకుండాచేశారు. ఆ చెరువుకు నీళ్లు తీసుకొస్తాం. హెచ్.ఎన్సీ పూర్తి చేస్తాం. పోలవరం పూర్తి చేసి హంద్రీనీవా, తెలుగంగ ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్నదే నా ఆశయం. దాన్ని తప్పకుండా చేస్తా. మీ భవిష్యత్ కోసం మీ పిల్లల భవిష్యత్ కోసం ఎన్డీయే అభ్యర్దులు గెలిపించాలని ప్రజలను చంద్రబాబు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article