కథనాలు రాస్తే ప్రాణరక్షణ ఉండదట…
రాడికల్స్ తో సత్సంబంధాలు ఉన్నాయట
బ్లేడ్ బ్యాచ్ లు సిద్ధంగా ఉన్నాయట
సుప్రీం కోర్టులో కూడా పలుకుబడి ఉందట
ఒకరికి జగన్మోహన్ రెడ్డి తో అనుబంధం ఉందట
మరొకరికి చంద్రబాబు తో సన్నిహితం ఉందట
ఇంకొకరికి పోలీసులే ఆయన కనుసన్నల్లోనే ఉన్నారట
అందుకే ఆరోజు దాడిచేసారట.. ఇంకేదయిన చేస్తారట
ప్రజాభూమి కథనాలకు ఓ వైపు బెదిరింపులు ..మరో వైపు ప్రశంసలు…
సరిగమలు తెలిసిన వారు సక్రమమే అంటూ సంతోషాలు…
సరిగమలు తమవే అనుకుంటున్నవారు సన్నాసి మాటలు..
రెండు వందలిస్తే చెప్పిన,ఇచ్చిన రాతలు రాస్తారట…
జర్నలిజం అంత దిగజారి పోయిందట…
ప్రముఖ పత్రికలే దాసోహం అంటున్నాయట…
టీవీ చానెళ్లు బ్రతిమాలాడుతున్నాయట…
ప్రజాభూమి,pbtv చెప్పింది నిజమే నని ఒప్పుకున్న పరుచూరి విజయలక్ష్మి…
స్వర్ణ కంకణాలపై మండి పడ్డ సావిత్రి కళాపీఠం…
బసవన్న అవార్డులపై భగ్గుమన్న సీనియర్ కళాధినేత..
విజయవాడ:
వీరంతా కళామతల్లి బిడ్డలట, వీరు కళామతల్లికి జీవం పోసేందుకు తమ కష్టార్జితాన్ని కూడా త్యాగం చేస్తున్నారట.ఇదే నిజం,ఇదే సత్యమట.ఇవన్నీ కొన్ని కళాసంస్థల అధినేతలు చెప్పుకొస్తున్న మాటలు.ఇది చాలా సంతోషం, ఆనందదాయకం.ఆయితే మరి వీరిలో వీరే విమర్శలు చేసుకోవడం పరిపాటి.ఇంకా అనేక రకాల కార్యక్రమాలు చేయడం షరా మాములే.వీరంతా పేద కళా కారుల కోసం కష్టపడే వారేనట.అలాంటప్పుడు సమస్యలు ఎందుకు వస్తున్నాయి…లోపం ఎక్కడ ఉందో పరిశీలించుకోవాల్సిందే వారే కదా.అక్కడ జరుగుతున్న లోపాలపై వారిలో వారే మీడియాకు ఎక్కుతారు.మళ్లీ బెదిరిస్తారు. ఈ క్రమంలో ప్రజాభూమి ,pbtv అధ్యయనం మొదలుపెట్టింది.ఈ నేపధ్యంలో అనేక వాస్తవాలు ఒళ్ళు గగుర్పాటు పరిచే విధంగా బయటపడ్డాయి.దీనిపై నిరంతర శోధన చేస్తూ నకిలీ డాక్టరేట్ల పై పలు సంచలన కథనాలను అందిస్తూ పేద కళాకారులకు అండగా నిలుస్తుంది.అయితే ఇక్కడే అసలు సమస్య మొదలైనది. ప్రజాభూమి pbtv కి నిజమైన కళాకారులు సంతోషం వ్యక్త పరుస్తున్నారు.మరి కొంతమంది బెదిరింపుల కు దిగుతున్నారు.ప్రాణాలకు కూడా రక్షణ ఉండదట,బ్లేడ్ బ్యాచ్ తో దాడులు జరగవచ్చట,వీరిలో కొందరికి రాడికల్స్ తో సత్సంబంధాలు ఉన్నాయట.కళారంగంపై కథనాలను రాస్తే కోర్టుకు లాగుతారట.చంద్రబాబు, వైఎస్ జగన్ సఫార్ట్ ఉందట.వీరి కార్యక్రమాలు ఏది చేసినా, ఏ మ్యాటర్ ఇచ్చిన రాస్తారట అందుకు రెండువందల రూపాయలు ఇస్తే చాలట.ఇందులో కొంత వాస్తవం లేక పోలేదు.జర్నలిజం కూడా దిగజారిపోయిందన్న ధోరణిలో కొంతమంది ఉన్నారు.ఇందులో భాగంగా పత్రికలు టీవీ చానెల్స్ పోటీపడుతున్నాయట.అందుకే దాడులు చేసిన,చేయబోతున్న పోలీసులు కూడా వీరి ఆధీనంలో ఉన్నారట. అందుకే ఆనాడు దాడి చేసిన ఆ పాత్రికేయుడికి న్యాయం దక్కలేదట.అయితే సావిత్రి కళా పీఠం అధ్యక్షురాలు పరుచూరి విజయ లక్ష్మి pbtv ఇంటర్వ్యూలో మా కథనాలను ప్రశంసించింది. స్వర్ణ కంకణాలపై,బసవన్న అవార్డులపై మండి పడి ఆవేదన వ్యక్తం చేశారు.మరి సీనియర్ కళావేదిక అధ్యక్షురాలు వెల్లడించిన విషయాలు కూడా వీరికి గిట్టవా..చూద్దాం వీరు చంపుతారా,కోర్టులో ఉరిశిక్ష వేయిస్తారా…పోలీసులతో ఎన్ కౌంటర్ చేయిస్తారో…