పులివెందుల టౌన్
జిల్లా , రాష్ట్ర స్థాయి , నుండి జాతీయ స్థాయి వరకు స్కేటింగ్ ఆటల పోటీలలో పులివెందుల స్కేటింగ్ విద్యార్థులు ప్రతిభ చూపినట్లు ఏ వన్ స్కేటింగ్ ఫౌండర్ పవన్ తెలిపారు. జనవరి 27,28, 29వ తేదీలో తమిళనాడులోని కోయంబత్తూరులో జాతీయస్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలలు నిర్వహించారు. ఈ పోటీలలో పులివెందుల ఏవన్ స్కేటింగ్ అకాడమీ కు చెందిన ఎం.వి. దన్విత , కుమార్ దాసరి, ఏ. విహాన్ రెడ్డి జాతీయస్థాయి స్కేటింగ్ పోటీలలో రజత, కాంష పథకాల్ని సాధించినట్లు పవన్ తెలిపారు ఈ విద్యార్థులు విద్యాధరి, నారాయణ పాఠశాలలో చదువుకుంటున్నట్లు ఆయన తెలిపారు. స్కేటింగ్ కి ప్రోత్సహించిన స్కూల్ యాజమాన్యాన్ని, విద్యార్థుల తల్లిదండ్రులను ఆయన అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుండే విద్యార్థులు స్కేటింగ్లో రాణించడం చాలా ఆనందంగా ఉందన్నారు విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా చదువులతో పాటు క్రీడలలో కూడా రాణించాలని ఆయన కోరారు ప్రతిరోజు స్కేటింగ్ నేర్చుకునే విద్యార్థులకు స్థానిక హెలిప్యాడ్ వద్ద కోచింగ్ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా స్కేటింగ్ లో ప్రతిభ చూపిన విద్యార్థులను కోచ్ పవన్ తో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు