జెడ్ బావవరంలో బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారంటీ
డా. చప్పిడి వెంకటేశ్వరరావు.
ప్రజాభూమి, కాకినాడ
రానున్న ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే కుటుంబానికి మూడు వంటగ్యాస్ సిలెండర్లు సంవత్సరాని ఇస్తామని డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈమేరకు బుధవారం
కాకినాడ రూరల్ కరప మండలం జెడ్ భావవరం గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డా. చప్పిడి వెంకటేశ్వరరావు ఆదర్వర్యంలో టీడీపి కరప మండల అధ్యక్షులు దేవు వెంకన్న అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా డా. చప్పిడి మాట్లాడుతూ సాధారణ మధ్యతరగతి, పేద ప్రజలు నిత్యావసర వస్తువుల అధిక ధరల కారణంగా రోజు గడవడమే కష్టంగా మారిందని దానికి తోడు ప్రస్తుత ప్రభుత్వం విద్యుత్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలమీద భారం మోపిందని అన్నారు. వచ్చే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో లో ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. దేవు వెంకన్న మాట్లాడుతూ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన ఈ వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికలలో నామరూపాలు లేకుండా పోవడం ఖాయమని, టీడీపి, జనసేన పార్టీలు సమిష్టిగా ప్రజల కష్టాలు తీర్చే మేనిపెస్టో త్వరలో ప్రవేశబెట్టబోతోందని అన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి భవిష్యత్తు గ్యారంటీ బాండ్లను పంపిణీ చేసి పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. కార్యక్రమంలో బూత్ కన్వినర్ గుబ్బల భాస్కరరావు,కంటిపూడి వెంకటరత్నం చౌదరి, పబ్బినీడి సోమరాజు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.